75 వ స్వాతంత్ర్య దినోత్సవ ఫ్రీడమ్ రన్
ఘనంగా
పత్రికా ప్రకటన
75 వ స్వాతంత్ర్య దినోత్సవ ఫ్రీడమ్ రన్
పాల్గొన్న ఎమ్మెల్యే. మున్సిపల్ చైర్మన్ లు
మిర్యాలగూడ. జనం సాక్షి వజ్రోత్సవాల(ఆజాద్ కా అమృత్ మహోత్సవం) సందర్భంగా మిర్యాలగూడ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లో శాసన సభ్యులు నలమోతు భాస్కర్ రావు జెండా ఊపి ఫ్రీడమ్ రన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వై . వెంకటేశ్వర రావు,సీ ఐ. ఎస్ ఐ , ప్రజా ప్రతినిధి లు, కే ఎన్ ఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల జాతీయ సేవా పథకం యూనిట్ 1 &2 వాలంటీర్స్ పాల్గొన్నారు. అదేవిధంగా కళాశాలలో ఈ రోజు భారత స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని కొనసాగించే దిశగా జాతీయ గీతాలాపన,మొక్కలు నాటడం, స్వాతంత్రోద్యమ నాయకుల ఫోటోలు శుభ్రం చేయడం,జాతీయ జెండా పై చైతన్యం కల్గించడం,స్వాతంత్రోద్యమ నాయకులను గుర్తుకు చేసుకుంటూ పూలమాలలతో అలంకరించి వారి స్ఫూర్తిని గుర్తుకు తెచ్చుకోవడం జరిగినది.ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ ఎస్ యూనిట్ -I & II ప్రోగ్రామ్ ఆఫీసర్ లు ఎన్ . కోటయ్య,పి . ఫ్రాన్సిస్ ఇకక్ కో – ఆర్డినేటర్ S. సునంద ,అకాడమిక్ కో – ఆర్డినేటర్ జె . నరేంద్రర్ రెడ్డి,రామిరెడ్డి,శ్రావణి,నరేష్,సుధాకర్ ,యాదమ్మ,యం కరుణాకర్ రెడ్డి,కే .కరుణాకర్ రెడ్డి ,చారీ,ఎన్ .కవిత, కే .కవిత తదితరులు పాల్గొన్నారు