టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
కొలంబొ: పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
కొలంబొ: పాకిస్థాన్, భారత్ జట్ల మధ్య మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కి టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌ను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. వాటర్ కెనాన్లతో సభాప్రాంగణంలోని జనాన్ని బయటికి తరమడానికి పోలీసులు యత్నిస్తున్నారు. బోరున వర్షం కురుస్తున్నా జై తెలంగాణ నినాదాలతో సభా ప్రాంగణం మారుమోగుతోంది.
హైదరాబాద్: శాంతియుతంగా కవాతు నిర్వహించాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి కోరారు. తెలంగాణవాదులు ఉద్రేకాలకు లోనుకావద్దని విజ్ఞప్తిచేశారు. పోలీసులు కూడా సంయమనం పాటించాలని హోంమంత్రి సూచించారు.
హైదరాబాద్: ఆదివారం రాత్రి 7 గంటల తర్వాత కూడా కవాతు కొనసాగుతుందని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం తెలిపారు. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ పోలీసులు అణిచివేత ధోరణి మానుకోవాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా…
హైదరాబాద్: సీమాంద్ర రాక్షస ప్రభుత్వం బరితెగించింది. ఇంకా మార్చ్ ముగియడానికి సమయం ఉన్నా తెలంగాణ మార్చ్‌కు హాజరైన జనంపై పోలీసులు వాటర్ కెనన్లును ప్రయోగిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన తెలంగాణావాదులు పోలీసులపై తీరగబడ్డారు. ప్రస్తుతం పిరస్థితి ఉద్రిక్తంగా ఉంది.
కొలంబో: టీ 20 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం సాధించింది. 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 17.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
హైదరాబాద్: తెలంగానోడి దెబ్బకు సీమాంద్ర సర్కారుకు ముచ్చెమటలు పట్టాయి. తెలంగాణ మార్చ్‌కు తరలి వచ్చిన ఆశేష జనవిహినికి భయపడి, కార్యక్రమం విజయవంతం అయినందున వార్తలను యావత్ ప్రపంచం తెలుసుకోకూడదు అన్న ఆలోచనతో రాష్ట్రంలోని అన్ని న్యూస్ ఛానళ్ల ప్రసారాలను…
హైదరాబాద్: ప్రభుత్వం అణచివేత ధోరణి మానుకోవాలని సీపీఐ శాసనభపక్షనేత గుండా మల్లేష్ అన్నారు. నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు కాలం చెల్లిందని, తెలంగాణ ప్రజలకు ఉద్యమాలు కొత్తకాదని పేర్కొన్నారు.
హైదరాబాద్: తెలంగాణ కవాతుకు పోలీసులు అడ్డుకోవడం అనైతికమని నాగర్ ర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్థన్‌రెడ్డి అన్నారు. కవాతులో భాగంగా నెక్లెస్‌రోడ్డులో ఏర్పాటుచేసిన సభలో నాగం మాట్లాడుతూ ఏమాత్రం ప్రాణ నష్టం జరిగినా ప్రభుత్వం కూలుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అప్రకటిత…
హైదరాబాద్: నెక్లెస్ రోడ్డు తెలంగాణవాదులకు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ప్లాజా వద్ద ఆందోళనకారులు 2 పోలీసు వాహనాలకు నిప్పుబెట్టారు. ఐమ్యాక్స్నుంచి నెక్లెస్ రోడ్డుకు వెళ్లే రహదారిలో ఉద్రిక్తత నెలకొంది.