Saturday, 14 November 2026

హైదరాబాద్

ఎన్‌హెచ్‌ఆర్‌సీ సెక్రటరీ జనరల్‌గా ఏకే జైన్‌

న్యూఢిల్లీ: జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నూతన సెక్రటరీ జనరల్‌గా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరుణ్‌ కుమార్‌ జైన్‌ నియమితులయ్యారు. 1977 బ్యాచ్‌ నాగాలాండ్‌ కేడర్‌కు చెందిన ఏకే జైన్‌ ప్రస్తుతం హోం మంత్రిత్వ శాఖలోని అంతర్‌…

మద్యం మత్తులో కన్నతల్లినే కడతేర్చిన కొడుకు

పెళ్లకూరు: మద్యం మత్తులో కన్నతల్లినే దారుణంగా హత్య చేసిన సంఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో గడవపడి బావిలో తోసేశాడు. ఆమె బయటకు వచ్చేందుకు ప్రయత్న చేస్తుండగా బండరాయితో మోది చంపేశాడు. స్థానికులు గమనించి అతనికి…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం

మన్ననూర్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా అమ్రాబాద్‌ మండల పరిధిలోని శ్రీశైలం, హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన రాములు, నర్సింహులు అనే వ్యక్తులు బుధవారం ఉదయం డోర్నాల వద్ద…

మవోయిస్టుల కదలికలపై కూంబింగ్‌

ఆదిలాబాద్‌: తూర్పు జిల్లాలో మవోయిస్టుల కదలికలున్నాయన్న అనుమానంతో బుధవారం పోలీసులు జోరుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో పోలీసు పార్టీలు అడవులను జల్లెడ పడుతున్నారు.

భారత్‌ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు

కొలంబొ: శ్రీలంకలో జరుగుతున్న టీ 20 వరల్డ్‌కప్‌ క్రికెట్‌ పోటీల్లో భారత్‌, ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో భారత్‌ 5 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆఫ్ఘన్‌ జట్టు ముందు…

ప్రస్తుతం ప్రజలు ఎన్నికలను కోరుకోవడం లేదు : పృథ్వీరాజ్‌ చవాన్‌

ముంబయి: దేశంలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశమే లేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ బుధవారం స్పష్టం చేశారు. కేంద్రంలోని యూపీఏ సర్కారు తృణమూల్‌ కాంగ్రెస్‌ తన మద్దతును ఉపసంహరించుకున్నప్పటికీ సంస్కరణలను బలపరచే పార్టీల మద్దతు ఉందని ఆయన…

అడుగంటిన ప్రకాశం బ్యారేజీ

విజయవాడ: విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం మరోసారి పూర్తిగా అడుగంటింది. దీంతో నీటిమట్టం 10.7 అడుగులకు పడిపోయింది. ఎగువ నుంచి నీరు వచ్చే ఆశలు సన్నగిల్లడంతో కాల్వలు కట్టేసేయోచనలో నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు. డుల్టాలో ఇప్పటికే…

గురజాడ 150వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

విజయనగరం: వ్వవహార భాషకు పట్టంకట్టిన మహాకవి గురజాడ అప్పారావు 150వ జయంతి ఉత్సవాలు బుధవారం విజయనగరంలోని ఆయన స్వగృహంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వట్టి వసంతకుమార్‌ గురజాడ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. నేతలు గురజాడ ఇంటిని పరిశీలించిన అనంతరం అక్కడినుంచి గురజాడ…

నాయకత్వ సృష్లి అనే అంశంపై ఓ సదస్సు

హైదరాబాద్‌: సంఘర్షణ లేకుండా నాయకత్వం పుట్టదని, సంఘర్షణనుంచే నాయకులు వస్తారని సౌండ్‌ ఆఫ్‌ మిలియన్స్‌ గ్లోబల్‌ ఫౌండేషన్‌ వ్వవస్థాపకులు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు అన్నారు. నాయకత్వ లక్షణాలు పవిత్రంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చేందుతుందన్న ఆశయంతో నగరంలోని రవీంద్రభారతిలో…

పాక్‌లో కారు బంబు పేలి 10 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లొని పెషావర్‌ నగర సరిహద్దులో ఒక కారు బాంబు పేలి 10 మంది మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌ ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన వ్యాన్‌ లక్ష్యంగా రిమోట్‌తో ఈ బాంబు పేల్నినట్లు పాక్‌ అధికారులు తెలిపారు.…