Thursday, 12 November 2026

హైదరాబాద్

విద్యుత్‌ కేటాయింపులను మరోసారి పున:సమీక్షించాలి:టీఆర్‌ఎస్‌

హైదరాబాద్‌:  తెలంగానలో 4థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుచేయాలని నేదునూరు,శంకర్‌పల్లి, విద్యుత్‌ కేంద్రాలకు గ్యాస్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, డిస్కంల మధ్య విద్యుత్‌ కేటాయింపును మరోసారి పున:సమీక్షించాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.

అరెస్ట్‌ చేసిన ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలి:జేఏసీ

హైదరాబాద్‌:  ప్రజాసమస్యలపై న్యాయబద్దంగా ఆందోళన చేస్తున్న ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ డిమాండ్‌ చేసింది. రైతులు ఎదుర్కొంటున్న కరెంట్‌ సమస్యలపై ప్రభత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేలు చేస్తున్న దీక్షను భగ్నం చేసి అరెస్ట్‌ చేయటం…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌:ఇవాళ బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 30,300గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.2,350గా ఉంది. కిలో వెండి ధర రూ.53,900గా ఉంది.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలు బంద్‌: వరంగల్‌ కలెక్టర్‌ నిర్ణయం

వరంగల్‌: వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల వినియోగంపై కలెక్టర్‌ ఆంక్షలు విధించారు. విద్యుత్‌ సంక్షోభ పరిస్థితుల్లో ఏసీలు వినియోగించరాదంటూ కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీచేశారు.

బోధనాఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటు

హైదరాబాద్‌: ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో బోధనా ఫీజులు నిర్ణయించేందుకు కమిటీ ఏర్పాటైంది. పది మంది అధికారులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

సాయంత్రం 5 గంటలకు సీఎం ప్రెస్‌ మీట్‌

హైదరాబాద్‌: ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా సమావేశం ఏర్పటుచేయనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థుతలపై ఈ సమావేశంలో ఆయన మాట్లాడన్నుట్లు సమాచారం.

వాయిలార్‌ రవితో టీ.కాంగ్రెస్‌ ఎంపీల సమావేశం

డిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ రోజు డిల్లీలో వాయిలార్‌ రవితో భేటీ అయ్యారు. ఒకటి రెండు వారాల్లో పీసీసీ పునర్‌ వ్యవస్థికరణకు కసరత్తు ప్రారంభమవుతుందని ఆయన చెప్పినట్లు ఎంపీలు పేర్కొన్నారు. ధర్మాన రాజీనామ విషయంలో జోక్యానికి కాంగ్రెస్‌…

దేశంలో అణువిద్యుత్‌ కేంద్రాలు సురక్షితం కాదు: కాగ్‌

ఢిల్లీ: దేశంలోని అణువిద్యుత్‌ కేంద్రాలు సురక్షితం కాదని కాగ్‌  పేర్కొంది. ఆకస్మికంగా ఏదైనా ఘటన జరిగితే దాన్ని ఎదుర్కొనే వ్యవస్థ అణువిద్యుత్‌ కేంద్రాల్లో లేదని కాగ్‌ తెలిపింది. అణువిద్యుత్‌  కేంద్రాలపై కాగ్‌ ఈ రోజు పార్లమెంటుకు నివేదిక సమర్పించింది.

నిన్న అరెస్టయిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: నిన్న అరెస్ట్‌ అయిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నాంపల్లిలోని క్రిమినల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మంగళవారం విద్యుత్‌సౌధ ముందు టీఆర్‌ఎస్‌ చేపట్టిన కరెంట్‌ ఆందోళన సందర్భంగా వీరు ట్రాన్స్‌కో సీఎండీ కార్యాలయంలోకి దూసుకుపోయి బైఠాయించారు. సాయంత్రం వరకు…

కరీంనగర్ లో జర్నలిస్టులపై పోలీసుల జులుం

కరీంనగర్‌:  విద్యుత్‌ కోతకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ చేపట్టిన ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయంలో జరిగే ముట్టడి, ధర్నా కవరేజికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. పోలీసుల దాడిలో ఇద్దరు జర్నలిస్టులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి నిరసనగా ఏపీయూడబ్లూజే ఆధ్వర్యంలో…