పరకాలలో కాంగ్రెస్‌కు అయిదవ స్థానం
వరంగల్: అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలవగ టీడీపీ మూడవ స్థానంలో నిలిచింది. బిజేపీ నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ అయిదవ స్థానంలో నిలిచింది.
వరంగల్: అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండవ స్థానంలో నిలవగ టీడీపీ మూడవ స్థానంలో నిలిచింది. బిజేపీ నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్ అయిదవ స్థానంలో నిలిచింది.
నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్ స్థానానికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఆయన రెండు లక్షల 90 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్ధి సుబ్బిరామిరెడ్డి పై విజయం సాధించారు.
ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి 27,403 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైకాపాకు 77,125 ఓట్లు రాగా,తెదేపాకు 49,649, కాంగ్రెస్‌కు 23,114 ఓట్లు పోలయ్యాయి.
ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా ముందంజలో ఉంది. 15వ రౌెండ్ పూర్తయ్యే సరికి తెదేపాపై 24,556 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి గెలుపోందారు. అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఫలితం బిక్షపతిని వరించింది. కొండా సురేఖ అత్యంత పోటి ఇచ్చినప్పటికి విజయం బిక్షపతిని వరించింది.
నెల్లూరు:నెల్లూరు లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. పది రౌండ్ల లెక్కిదపు ముగిసేరికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 1,79,187 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.
వరంగల్: పరకాల విజయం ఎవరిని వరించనుంది అనేది ఉత్కంట నెలకొంది 18వ రౌండ్లో 556 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి సాగుతున్నారు. ప్రస్థుతం చివరి రౌండ్ లెక్కింపు జరుగుతుంది.
ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 స్థానాల్లో వైకాపా గెలుపొంది. రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. పరకాలలో తెరాస వైకాపా మధ్య పోటి నెలకొంది. గెలుపొందిన అభ్యర్థుల వివరాలు: నరసన్నపేట: ధర్మానకృష్ణదాస్-వైకాపా…
వైకాపా గెలుపుతో ప్రజలు జగన్ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
జగన్ నిర్ధోషని ప్రజలు తీర్పునిచ్చారని వైఎస్ విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వైఎస్ రాజశేేఖర్ రెడ్డిని మరచిపోలేరని పార్టీ గెలుపుకోసం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.