Thursday, 5 November 2026

హైదరాబాద్

పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్‌ఎస్‌

వరంగల్‌: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్‌ఎస్‌ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.

రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు చోట్ల విజయం సాధించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 18 స్థానాల్లో  పోటి చేసినప్పటికీ  రెండు స్థానాలతో ఆ పార్టీ సరిపెట్టుకుంది.

పరకాలలో 16రౌండ్లు పూర్తి

పరకాల: పరకాలలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.

అవినీతి అబ్బద్దపు ప్రచారమే మా కోంప ముంచింది:తలసాని

హైదరాబాద్‌: జగన్‌పై అవినీతి అబద్దపు ప్రచారంవల్లే మేం ఓడిపొయామని ఈ అవినీతి ప్రచారమే మా కొంప ముంచిదని టిడిపి సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్‌ అన్నారు.

మాచర్ల, ప్రత్తిపాడులో డిపాజిట్‌ కోల్పోయిన కాంగ్రెస్‌

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 18 స్థానాలకు గాను ఆ పార్టీ నరసాపురంలో గెలుపొంది. రామచంద్రాపురంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మాచర్ల, ప్రత్తిపాడులో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. ఇక్కడ కాంగ్రెస్‌ మూడో…