Sunday, 29 November 2026

జిల్లా వార్తలు

రాయల తెలంగాణకు తెదేపా ఫొరం వ్యతిరేకం:ఎర్రబెల్లి

వరంగల్‌:రాయల తెలంగాణకు తెదేపా తెలంగాణ ఫొరం పూర్తి వ్యతిరేకమని ఫొరం కన్వీనర్‌ ఎర్రబెల్లి దయాకరరావు తెలిపారు.ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ అలాంటి ప్రతిపాదన వస్తే కలిస్తి పార్టీలతో ఉద్యమిస్తామన్నారు.హైదరాబాద్‌లేని తెలంగాణను అంగీకరించమన్నారు.రాజకీయ లబ్ది కోసమే రాయల తెలంగాణ…

పట్టాభికి రెండ్రోజుల ఏసీబీ కస్టడీ

హైదరాబాద్‌:  గాలి జనార్దన్‌రెడ్డి బెయిల్‌ ముడుపుల కేసులో సస్పెండ్‌ ఆయిన న్యాయమూర్తి పట్టాభి రామారావును రెండ్రోజుల ఏసీబీ కస్టడీకి  అనుమతిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు  పట్టాభిని…

ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్న అధికారులు

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు ఈ రోజు ఓయూ హాస్టల్‌లో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. కాలపరిమితి ముగిసినా ఖాళీచేయలేదని పోలీసుల సహకారంతో విద్యార్థులను ఖాళీ చేయిస్తున్నారు. మహిళా హాస్టళ్లలో కరెంటు, నీటి వసతిని ఓయూ సిబ్బంది తొలగించారు.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌ జిల్లా బాసుగూడా అటవీప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, మావోయిస్టులకు మధ్య జరుగుతున్న ఎదురుకాల్పుల్లో 23 మంది మావోయిస్టులకు మరణించారు. ఆరగురు సీఆర్‌పీఎఫ్‌  జవాన్లకు, ముగ్గురు మావోయిస్టులకు  తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను రాయ్‌పూర్‌ తరలించారు.…

సింగరేణి ఎన్నికల్లో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ హవా

గోదావరిఖని – సింగరేణి గుర్తింపు కార్మిక సంఘానికి గురువారం జరిగిన ఎన్నికల్లో తొలి ఫలితాన్ని ఏఐటీయూసీ నమోదు చేసుకున్నది. ఖమ్మం జిల్లా ఇల్లెందులో ఏఐటీయూసీ విజయం సాధించింది. హవా కొనసాగ ఫలితాలు వెల్లడయ్యాయి. గురువారం రాత్రి కడపటి వార్తలు…

ప్రశాంతంగా ముగిసిన సింగరేని కార్మికసంఘం ఎన్నికలు

ఖమ్మం :   సింగరేని గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రశాంతంగ ముగిసినాయి. దాదాపు 90శాతం పోలింగ్‌ నమోదయినట్లుగ తెలుస్తుంది. ఓట్ల లెక్కింపు ఏడు గంటలనుండి ప్రారంభం కానుంది. రాత్రి 12గంటల వరకు పూర్తి స్థాయి ఫలాతాలు వెలువడనున్నాయి.ప్రాంతాల వారిగ పోలింగ్‌…

రాష్ట్రంలో విత్తనాల కొరత లేదు

హైదరాబాద్‌:  రాష్ట్రంలో విత్తనాల కొరత లేదని రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి కన్నా  లక్ష్మీనారాయణ  చెప్పారు. మహికో కంపెనీకి చెందిన బీటీ విత్తనాలు తప్ప మిగతా 52 కంపెనీలకు చెందిన 100 రకాలు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు. విత్తనాల…

నిలిపివేసిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

హైదరాబాద్‌:  శంషాబాద్‌ విమానాశ్రయంలో బ్యాంకాక్‌కు వెళ్లాల్సిన థాయ్‌ ఎయిర్‌ లైన్స్‌ విమానాన్ని సాంకేతిక కారణాలతో అదికారులు మళ్లీ నిలిపివేశారు. మరమ్మతులు చేసిన కాసేపటికి సాంకేతిక  లోపాలు తలెత్తడంతో విమానాన్ని అధికారులు నిలిపివేసి మరమ్మతులు చేపట్టారు.

విశాఖ ఎన్టీపీసీ దగ్గర ఉద్రిక్తం

విశాఖపట్నం: విశాఖపట్నం ఎన్టీపీసీ నుంచి సముద్రంలోకి పైపు లైన్లు వేయటం వలన సముద్రంలోని చేపలు చనిపోతాయని  ఆగ్రహించిన ప్రజలు ఎన్టీపీసీని ముట్టడించారు. రాళ్ళు, కర్రలతో దూసుకొచ్చి ఆందోళన చేశారు. దీనితో పోలిసులు ఆరు రౌండ్లు గాలీలోకి కాల్పులు జరిపారు.…

భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో కూలినగోడ

హైదరాబాద్‌: నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న భూపరిపాలన కమిషనర్‌ కార్యాలయంలో ఒక గదిపై కప్పు, గోడ కూలిపోయాయి  మరమ్మతులు చేస్తుండగా అకస్మాత్తుగా ఇవి కూలిపోయాయి. ఆ సమయంలో కార్యాలయంలో విధినిర్వహణలో ఉన్న నలుగురు ఉద్యోగులను  అగ్నిమాపకదళ సిబ్బంది సురక్షితంగా…