Monday, 23 November 2026

సీమాంధ్ర

లారీ బోల్తా :12 మందికి తీవ్ర గాయాలు

కడప : సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల బస్టాండ్‌ వద్ద బాతులతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో తెదేపా నేత మృతి

కంచికచర్ల : కృష్ణా జిల్లా కంచికచర్లలో జాతీయరహదారిపై రామాపురం అడ్డరోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని పరిటాలకు చెందిన తెదేపా నేత పోగంటి అప్పారావు (43) మృతి చెందాడు. హైదరాబాద్‌ నుంచి కంచికచర్లకు అప్పారావు కార్లో వస్తుండగా…

ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తారా

విశాఖ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయలార్‌ రవి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు మండిపాడ్డారు. సీమాంధ్రలో ఉద్యమాలు సరిగా చేయలేదన్న వాయలర్‌ వాఖ్యలు సరికాదని వ్యాఖ్యానించారు. ఒక్క రోజులోనే వంద మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసిన…

ఏసీబీకి వలలో వినువొండ విద్యుత్‌ ఏఈ

గుంటూరు: లంచం తీసుకుంటూ వినుకొండ విద్యుత్‌ శాఖ ఏఈ సురేశ్‌కుమార్‌ ఏసీబీ అధికారులు పట్టుబడ్డారు. ఓ వ్యక్తి వద్ద నుంచి రూ. ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఏసీబీ అధికారులు వల పన్ని ఏఈని పట్టుకున్నారు.

సమావేశానికి పాక్‌ అంగీకారం

శ్రీనగర్‌ : ఎట్టకేలకు భారత్‌ సైన్యాధికారులతో సమావేశానికి పాకిస్థాన్‌ అంగీకరించింది. జమ్మూకాశ్మర్‌లోని పూంఛ్‌ జిల్లాలో రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ఇరుదేశాల బ్రిగేడియర్లు సమావేశం కానున్నారు. ఇటీవల పాక్‌ తరచుగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో భారత్‌ ఈ…

గ్రామనేతల భద్రతపై ఒమర్‌ అబ్దుల్లా సమీక్ష

శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా గ్రామ పెద్దల భద్రతపై ఈరోజు సమీక్ష జరుపుతున్నారు. బారాముల్లా జిల్లాలో ఒక సర్పంచిన కాల్చిచంపిన ఘటన అనంతరం శనివారం సోపోర్‌లో మరో మహిళా పంచాయతీ సభ్యురాలిపై గెరిల్లాలు కాల్పులు జరపడంతో…

కాంగ్రెస్‌ పార్టీకి కాకినాడ ఎమ్మెల్యే రాజీనామా

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పీసీసీ అధినేతకు పంపినట్లు చెప్పారు ద్వారంపూడి త్వరలో వైకాపాలో చేరనున్నట్లు సమాచారం.

వైద్య కళాశాల విద్యార్థిని ఆత్మహత్య

శ్రీకాకుళం: వైద్య కళాశాల విద్యార్థిని  ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. రాజోలు జేమ్స్‌ వైద్య కళాశాలలో చదువుతున్న  విద్యార్థిని ఐశ్వర్యసాయి ఈ తెల్లవారుజామున ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఘటనాస్థలికి చేరుకున్న…

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరి మృతి

నాగాయలంక: కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పక్కపట్లవారిపాలెంలో ఈ ఉదయం ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.

టిక్కెట్లు అక్రమంగా విక్రయిస్తున్న ట్రావెల్స్‌పై కేసు

విశాఖపట్నం : నగరంలోని ద్వారకానగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా టిక్కెట్లు విక్రయిస్తున్న ఎన్‌వీటి ట్రావెల్స్‌పై రైల్వేపోలీసులు దాడులు నిర్వహించారు. ట్రావెల్స్‌పై కేసు నమోదు చేశారు.