Sunday, 15 November 2026

వార్తలు

ఢిల్లీ అత్యాచార ఘటనపై ఈ – ఛార్జిషీట్‌ దాఖలు

న్యూఢిల్లీ : ఢిల్లీ అత్యాచార ఘటనపై పోలీసులు ఈ-ఛార్జిషీట్‌ దాఖలు చేశారు. ఘటనకు సంబంధించి పోలిసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌తో సహా అన్ని పత్రాలు తాను స్వీకరించినట్లు మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ నమిత్రా అగర్వాల్‌ తెలియజేశారు. ఘటనకు బాధ్యులైన అయిదుగురు…

విశాఖ హెటిరో ఔషద పరిశ్రమలో పేలుడు

విశాఖ : విశాఖ నరగంలోని హెటిరో ఔషధ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్‌ పేలింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు.  

సోమవారం భారత్‌కు రానున్న అక్బరుద్దీన్‌

హైదరాబాద్‌: లండన్‌ వెళ్లిన ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సోమవారం సాయంత్రం భారత్‌కు రానున్నారు. హిందూ మతాన్ని కించరిచేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయనపై పలు పోలీస్‌స్టేషన్లలో కేసు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా, డీజీపీ దినేష్‌రెడ్డి…

‘ఎఫ్‌డీఐ’లను అనుమతించబోం : కేరళ ముఖ్యమంత్రి

చెన్నై : చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను తమ రాష్ట్రంలో అనుమతించబోమని కేరళ ముఖ్యమంత్రి ఉమన్‌చాందీ స్పష్టం చేశారు. నగరంలో తమ బంధువు ఒకరు మరణించడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు శుక్రవారం ఆయన చెన్నై వచ్చారు.…

పాలిటెక్నికల్‌ ఉద్యోగాల భర్తీకి ట్రిబ్యునల్‌ అనుమతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో పాలిటెక్నికల్‌ అధ్యాపకుల ఉద్యోగాల భర్తీకి పరిపాలనా ట్రిబ్యునల్‌ అనుమతించింది. నోటిఫికేషన్‌ను 110 ఉద్యోగాలకే పరిమితం చేయాలని దాఖలైన పిటిషన్‌ను ఈ సందర్భంగా ట్రిబ్యునల్‌ కొట్టివేసింది.

రాష్ట్రంలో కొత్తగా 11 జాతీయ రహదారులు

న్యూఢిల్లీ: రాష్ట్రంలోని ప్రధాన రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన విజ్ఞప్తికి కేంద్రం స్పందించింది. పదకొండు రహదారులను జాతీయ రహదారులుగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్‌రిజిస్ట్రార్‌ హఫీజ్‌ రూ. 15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు.

ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

ఢిల్లీ : కాంగ్రెస్‌ పార్టీ కీలక బృందం ఈరోజు సాయంత్రం ప్రధాని నివాసంలో భేటీ అయింది. ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే, ఆర్థిక మంత్రి చిదంబరం, రక్షణ మంత్రి ఆంటోని, పార్టి సీనియర్‌…

శాసనసభ్యులు సభావిలువలు పాటించాలి : సభాపతి

హైదరాబాద్‌: ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు వివిధ రాపాల్లో తన దృష్టికి వచ్చాయని స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ఇప్పటికే చాలా మంది ఫోన్లు, ఈ మెయిల్స్‌ ద్వారా పూర్తి సమాచారం అందించారని ఆయన…

భారత్‌ పర్యటన రద్దు చేసుకున్న మియాందాద్‌

న్యూఢిల్లీ : పాక్‌ మాజీ క్రికెటర్‌ జావేద్‌ మియాందాద్‌ భారత పర్యటన రద్దయింది. ఆయనకు భారత్‌ వీసా ఇవ్వడంపై విమర్శలు వెల్లువత్తిన విషయం తెలిసిందే. అండర్‌ వర్డల్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీంతో మియాందాద్‌కు బంధుత్వం వుండటంతో ఆయనకు వీసా…