Sunday, 15 November 2026

వార్తలు

ప్రశ్నాపత్రం లీకైందంటూ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ అధ్యాపకుల ప్రశ్నాపత్రం లీకైందంటూ అహ్యర్థులు ఆరోపించారు. నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులు ఆందోళన నిర్వహించారు.

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

న్యూఢిల్లీ : పాక్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. భారత జట్టులో స్వల్ప మార్పులు చేశారు సెహ్వాగ్‌, దిండా స్థానంలో రహానే, షమీ అహ్మద్‌లకు చోటు కల్పించారు. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు నెగ్గి…

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ ట్యాంక్‌ బండ్‌పై మహిళల ప్రదర్శన

    హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) : ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం సాయంత్రం మహిళలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై భారీ ప్రదర్శన నిర్వహించారు. మహిళా హక్కులు కాపాడలని, రక్షణ చర్యలు చేపట్టాలని, అకృత్యాలకు పాల్పడే…

త్వరలో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ

హైదరాబాద్‌: తెలంగాణ ఉత్యమం సమాంతరంగా, సమన్వయంతో ముందుకు సాగాలి అని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు.  త్వరలోనే హైదరాబాద్‌ నగరంలో భారీ బహిరంగ సభకు సన్నాహాలు చేయనున్నట్టు ఆయన తెలియజేశారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడేవారు ఒకరి…

అభివృద్ధి రుసుం వసూలు చేయక తప్పదు : బొత్స

హైదరాబాద్‌:  ఆర్టీసీ బస్సుల్లో అభివృద్ధి రుసుం వసూలు చేయక తప్పదని పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలియజేశారు. 24వ రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని…

తెలుగు పేర్లు పెట్టేలా చట్టం తీసుకొస్తాం : తమ్మారెడ్డి

హైదరాబాద్‌: తెలుగు సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేలా ప్రభుత్వంతో మాట్లాడి చట్టం తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. ఇటీవల మహాసహల సందర్భంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన…

విద్యుత్‌ ఛార్జీలు పెంచాలని ప్రతిపాదించిన డిస్కమ్‌లు

హైదరాబాద్‌: ఏప్రీల్‌ నుంచి విద్యుత్‌ ఛార్జీలు పెంచే ప్రతిపాదనను డిస్కమ్‌లు నియంత్రణా మండలికి సమర్పించాయి. 2013-14 ఏడాది వార్షిక రాబడి ప్రణాళికను కూడా డిస్కమ్‌లు రూపొందించాయి. వార్షిక రాబడి ప్రణాళికలో ఆదాయలోటు భర్తీకి ఛార్జిల పెంచాలని డిస్కమ్‌లు ప్రతిపాదించాయి.

బ్రిస్బేన్‌ టైటిల్‌ సొంతం చేసుకున్న సెరీనా

బ్రిస్బేన్‌: బ్రిస్బేన్‌ ఇంటర్నేషనల్‌ టెన్నీన్‌ టోర్నమెంట్‌ మహిళా టైటిల్‌ను సెరీనా విలియమ్స్‌ సొంతం చేసకుంది. రష్యా క్రీడాకారణి పావల్యూచెన్కోవాతో జరిగిన తుదిపోరులో 6-2, 6-1 తేడాతో విజయం సాధించింది. మరోపక్క పురుషుల విభాగంలో ఆండీ ముర్రే ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

విచారణకు రాకపోతే చర్యలు తీసుకుంటాం : డీజీపీ

హైదరాబాద్‌: విచారణకు రాకపోతే ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ దినేష్‌రెడ్డి అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అక్బరుద్దీన్‌పై పలు కేసు నమోదైన నేపథ్యంలో విచారణకు హాజరుకావాల్సిందిగా కోరినట్లు ఆయన తెలియజేశారు. విచారణకు తాను హాజరవుతానని…

శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలర్ట్‌

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. ముంబయి జెట్‌ ఎయిర్‌వేన్‌ విమానానికి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని విమాన్నాశ్రయాల్లో భద్రత పెంచారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. మరోపక్క ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌…