Friday, 13 November 2026

వార్తలు

ఎమ్మెల్యే యానాం మల్లాడి కృష్ణారావు రాజీనామా

ఢీల్లి: యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు రాజీనామా చేశారు. ఆయన ఢిల్లీ నుంచి పుదుచ్చేరి అసెంబ్టీ స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్న అసంతృప్తితో రాజీనామా చేస్తున్నాట్లు మల్లాడి కృష్ణారావు తెలిపారు.

టస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌

క్యాండీ: పల్లెకెలె స్టేడియం ఉత్కంఠభరితంగా సాగిన విండీస్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌ తర్వాత మరో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంక, ఇంగ్లాండ్‌ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కు టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ బౌలింగ్‌ ఎంచుకుంది.

సూపర్‌ ఓవర్‌లో వెస్టీండీస్‌ విజయం

క్యాండీ: టీ 20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-8లో న్యూజిలాండ్‌, వెస్టీండీస్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ క్రికెట్‌ ప్రేమికులకు మరోసారి టీ 20 మజాను అందించింది. ఇరు జట్ల స్కోర్లు సమంకావడంతో సూపర్‌ఓవర్‌ ఆడాల్సి వచ్చింది. సూపర్‌ ఓవర్లో…

ఛార్జీల పెంపు పేద మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలి: ఎం. రాఘవయ్య

హైదరాబాద్‌: ఛార్జీలు పెంచకపోతే భారతీయ రైల్వేకు మనుగడ లేదని సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఎంప్లాయీన్‌ సంఘ్‌ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య అన్నారు. ఛార్జీల పెంపు కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు అనుకూలంగా ఉండాలని ఆయన సూచించారు. కొందరు…

ప్రభుత్వం ఉద్యమ కారులను అణచివేయడాన్ని నిరసిస్తూ రేపు నిరసన దీక్ష: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు నిర్వహించడం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై నిలకడగా ఒత్తిడి పెంచగలిగామని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. అయితే ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లరి మూకను అణిచివేశామన్న ఆలోచనలో ఉన్నాయని, సమస్య…

రాయలసీమ ఎమ్మెల్యేలతో కలసి ఢిల్లీ వెళ్తాం: టీజీ

కర్నూలు: రాష్ట్ర విభజనతో నిమిత్తం లేకుండా రాయలసీమ పరిరక్షణ, హక్కుల సాధన కోసం పోరాడతామని మంత్రి టీజీ వెంకటేశ్‌ అన్నారు. రాష్ట్ర విభజనపై ఢిల్లీలో పరిస్థితులను అంచనా వేయడానికి రాయలసీమ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్తామని మంత్రి చెప్పారు

తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించింది: చంద్రబాబు

హైదరాబాద్‌: తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రైతులకు వ్వవసాయ ఖర్చులు పెరిగి గిట్టుబాటు ధర దక్కట్లేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో సుస్థిరమైన, సమర్ధవంతమైన పాలన తెదేపాతోనే సాధ్యమని చంద్రబాబు చెప్పారు.

2014 కల్లా తెలంగాణ వస్తూంది: జనారెడ్డి

హైదరాబాద్‌: తమను రాజీనామా చేయమనడానికి ఐకాస ఎవరని మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఒకరికొకరు సహకరించుకోవాలి తప్ప ఒకరిపై మరొకరు రాజకీయ విమర్శలు తగవని ఆయన హితవు పలికారు. కవాతుకు ముఖ్యమంత్రిని ఒప్పించి అనుమతిప్పిస్తే తమపైనే విమర్శలతు…

బెయిల్‌ పిటిషన్లపై విచారణ వాయిదా

హైదదాబాద్‌: ఓఎంసీ కేసులో నిందితురాలిగా జైలులో ఉన్న శ్రీలక్ష్మీ బెయిల్‌ పిటిషన్‌పై వచారణను సీబీఐ న్యాయస్థానం ఎల్లుండికి వాయిదా వేసింది. బీపీ ఆచార్య బెయిల్‌ పిటిషన్‌పై వచారణ ఈ నెల 5కు వాయిదా పడింది. ఆచార్యకు బెయిల్‌ ఇవ్వద్దంటూ…

ముగిసిన తెలంగాణ, కాంగ్రెస్‌ మంత్రుల సమావేశం

హైదరాబాద్‌:ఉపముఖ్యమంత్రితో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, మంత్రుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ కవాతు సందర్భంగా చోటు చేసుకున్న  పరిణామాలపై నేతలు చర్చించారు., తెలంగాణ సాధన కోసం త్వరలో పూర్తిస్థాయి కార్యాచరణను సిద్ధం చేస్తామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు…