Tuesday, 3 November 2026

2014 కల్లా తెలంగాణ వస్తూంది: జనారెడ్డి

హైదరాబాద్‌: తమను రాజీనామా చేయమనడానికి ఐకాస ఎవరని మంత్రి జానారెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఒకరికొకరు సహకరించుకోవాలి తప్ప ఒకరిపై మరొకరు రాజకీయ విమర్శలు తగవని ఆయన హితవు పలికారు. కవాతుకు ముఖ్యమంత్రిని ఒప్పించి అనుమతిప్పిస్తే తమపైనే విమర్శలతు చేయటం ఎంతవరకూ సబబని నిలదీశారు. మంత్రులంతా కలిసి త్వరలోనే ఢిల్లీ వెళ్తి తెలంగాణ కోసం కోర్‌ కమిటీ సభ్యులపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పారు. 2014 కల్లా తెలంగాణ వస్తుందనే ధీమాను జానారెడ్డి వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *