Wednesday, 11 November 2026

వార్తలు

తెలంగాణపై తీర్మానం పెట్టాలని ప్రధానికి బాబు లేఖ

హైదరాబాద్‌: తెలంగాణపై తీర్మానం పెట్టాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానికి లేఖ రాశారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆయన సూచించారు. తెలంగాణ అంశంపై తాము గతంలోనే కేంద్రానికి లేఖ…

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ

హైదరాబాద్‌: పోలీసుశాఖలోని కమ్యూనికేషన్‌, పీటీవో, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరోలో వివిధ విభాగాలకు సంబంధించి కానిస్టేబుల్‌, ఎస్‌ఐ స్థాయి అభ్యర్థులకు రాత పరీక్ష తేదీలను ఖరారు చేసి హాల్‌టికెట్లు జారీచేసినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ మాలకొండయ్య…

పౌరసరఫరాలపై సచివాలయంలో తులసిరెడ్డి సమీక్ష

హైదరాబాద్‌: పౌరసరఫరాల శఖపై 20 సూత్రాల పథకం ఛైర్మన్‌ ఎస్‌.తులసిరెడ్డి బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. పౌరసరఫరాల కమిషనర్‌ మర్‌ప్రీత్‌సింగ్‌, డైరెక్టర్‌ చిరంజీవులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. అనంతరం తులసిరెడ్డి విలేరులతో మాట్లాడారు. 43,129 చౌకధరల దుకాణాల ద్వారా…

ముంబయి దాడుల కుట్రదారుల స్వర నమూనాలను ఇవ్వాల్సిందిగా పాకిస్థాన్‌కు విజ్ఞప్తి

మాల్దీవులు: ముంబయి దాడుల కుట్రదారుల స్వర నమూనాలను ఇవ్వాల్సిందిగా భారత్‌ పాకిస్థాన్‌కు మరోమారు విజ్ఞప్తి చేసింది. 26/11 దాడుల నిందితులపై విచారణను వేగవంతం చేయాలని, సీమాంతర ఉగ్రవాదాన్ని ఆపాలని కోరింది. సార్క్‌ హోం మంత్రుల సమావేశం సందర్భంగా భారత…

అక్టోబరు 2వ తేదీన విజ్ఞాన కేంద్రంలో జనవిజ్ఞాన వేదిక

హైదరాబాద్‌: జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ విస్తృత సమావేశం అక్టోబరు 2వ తేదీన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందని జన విజ్ఞాన వేదిక ప్రధాన కార్యదర్శి ఎన్‌.శంకరయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో…

నదుల అనుసంధానంపై ఆదేశాలను పన:సమీక్షించేది లేదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: నిర్దిష్ట గడువులోపు నదుల అనుసంధానం ప్రాజెక్టును అమలు చేయాలంటూ ఫ్రిబ్రవరి 27 న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలను పున:సమీక్షించాలని కేంద్రం చేసిన విజ్ఞప్తిని బుధవారం సుప్రీంకోర్టు కొట్టెసింది. పున:సమీక్ష కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయడంలో జాప్యం…

రాష్ట్ర ఖనిజాభివృద్ధిసంస్థకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలి: కిశోర్‌

న్యూఢిల్లీ: విశాఖ మన్యంలో బాక్సైట్‌ తవ్వకాలకు అనుమతులు నిలిపివేయాలని కేంద్రమంత్రి కిశోర్‌చంద్రదేవ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాశారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధిసంస్థకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలని కోరుతూ…

పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు

గుంటూరు: గుంటూరు పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. కార్పొరేట్‌ విద్యాసంస్థల బోధన, బోధనేతర సబ్బంది పీఎఫ్‌ ఖాతాల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆయా విద్యా సంస్థలు పీఎఫ్‌ డబ్బును మనిహాయిస్తున్నా, ఖాతాల్లో జమచేయటం లేదని ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.

మధ్యంతర ఎన్నికలకు సిద్దం కండి: గఢ్కరీ

సూరజ్‌ఖండ్‌: కేంద్రంలోని యూపీఏకు తృణమూల్‌ కాంగ్రెస్‌ తన మద్దతును వెనక్కు తీసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మనుగడ కష్టమని భాజపా అధ్యక్షుడు నితిన్‌గఢ్కరీ అన్నారు. కేంద్ర ప్రభుత్వం మునిగిపోతోందని దీన్ని దృష్టిలో వుంచుకొని భాజపా శ్రేణులు మధ్యంతర ఎన్నికలకు…

ఈనెల 30వ తేదీన కవాతు ఖచ్చితంగా జరుగుతుంది: కేకే

హైదరాబాద్‌: ఈనెల 30వ తేదీన తెలంగాణ కవాతు ఖచ్చితంగా జరుగుతుందనీ దానికి తన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల మద్దతు ఉంటుందని తెలిపారు. కవాతు శాంతియుతంగా జరగాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. పోలీసులు చెచ్చగొట్టకుండా, ప్రభుత్వం అనుమతిస్తే శాంతియుత పద్దతిలో…