Wednesday, 11 November 2026

వార్తలు

అయిదోసారి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: ఓఎంసీ అక్రమాల కేసు నిందితుడు బీవీ శ్రీనివాస్‌రెడ్డికి సీబీఐ కోర్టు బెయిలు నిరాకరించింది. అయిదోసారి దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఇవాళ న్యాయస్థానం కొట్టివేసింది. అరెస్టై ఏడాదయిందని, ఛార్జిషీట్‌ కూడా దాఖలు చేసినందున బెయిల్‌ ఇవ్వాలని శ్రీనివాస్‌రెడ్డి…

కాంగ్రెస్‌ హయాంలో అవినీతే తప్ప అభివృద్ధి కరవైంది: చంద్రబాబు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు తీగలపై దుస్తులు ఆరేసుకోవాలని తాను ఎప్పుడో చెప్పానని ఇప్పుడు అదే విధంగా జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ హయాంలో అవినీతే తప్ప అభివృద్ధి కరవైందన్నారు. చంచల్‌గూడ జైలాంతా కాంగ్రెస్‌ నేతలతో…

ఆర్టీసీ, రావాణాశాఖాధికారులతో మంత్రి బొత్స సమీక్షా సమావేశం

హైదరాబాద్‌: అక్రమ రవాణా చేస్తూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌, ఇతర వాహనాలపై ముమ్మర దాడులు చేయాలని రవాణా శాఖామంత్రి బొత్స సత్యనారాయణ అధికారులకు ఆదేశాలు జరీ చేశారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఆర్టీసీ, రవాణాశాఖాధికారులతో…

సీ బ్లాక్‌ వద్దకు దూసుకు వచ్చిన జాగృతి కార్యకర్తలు

హైదరాబాద్‌: విజయవాడలో రాష్ట్ర విభజనకు సంబంధించి సీఎం చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆరుగురు కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సమతా భవనం వద్దకు చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బుధవారం పలువురు సచివాలయం సీ…

రేపటినుంచి ఎంసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం

హైదరాబాద్‌: ఎంసెట్‌ అడ్మిషన్ల చివరి విడత కౌన్సెలింగ్‌ రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు చివరి విడత కౌన్సెలింగ్‌ జరుగుతుంది. చివరివిడత కౌన్సెలింగ్‌కు హాజరయిన అభ్యర్థులకు అక్టోబరు 2 సాయంత్రం ఆరుగంటలకు సీట్లను కేటాయిస్తారు. మొదటివిడత…

సాగరహారం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెరాసా కార్యకర్తలు, తెలంగాణా వాదుల అక్రమ అరెస్టులను కేసీఆర్‌ ఖండించారు. సాగరహారం శాంతియుతంగా సాగడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వమే రాజకీయాలకు పాల్పడటం అమానుషమన్నారు.

ముస్లింలతో చంద్రబాబు సమావేశం

హైదరాబాద్‌: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ముస్లిం మతపెద్దలు, మేధావులతో సమావేశమయ్యారు. పార్టీలో వారి భాగస్వామ్యం పెంచేందుకు తీసుకోవల్సిన చర్యలపై వారితో చర్చలు జరిపారు. రాజకీయల్లో ముస్లింలకు రిజర్వేషన్లు, వక్ఫ్‌భూముల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల్లో న్యాయబద్ధమైన…

ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీపూ కేసు పెట్టాలి: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన మధుయాష్కీపై రాజద్రోహం కేసు పెట్టాలని శాసనమండలి ప్రతిపక్షనేత దాడి వీరభద్రరావు డిమాండ్‌ చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు తమ వీరత్వాన్ని సోనియా వద్ద ఢిల్లీలోనూ ప్రదర్శించాలే కానీ సీమాంధ్ర ప్రజలపై కాదని…

ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కవాతు నిర్వహించే తీరుతాం: కోదండరాం

హైదరాబాద్‌: ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ కవాతు నిర్వహించే తీరతామని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుకుకుని ఉద్యమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. తెలంగాణ నేతల అరెస్టులను ప్రభుత్వం వెంటనే…

తెలంగాణా సమస్య అత్యంత క్షిష్టమైంది: ఆజాద్‌

శ్రీనగర్‌: తెలంగాణ సమస్య అత్యంత క్లిష్టమైందని గులాంనబీ ఆజాద్‌ అన్నారు. 40,50 ఏళ్లుగా నానుతోన్న ఈ సమస్య పరిష్కారానికి తీసుకున్న చర్యలు విఫలమవుతున్నాయి. పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్చటానికి ప్రయత్నిస్తున్నాం . మూడు ప్రాంతాల ఆమోదం లభించే వరకు…