Wednesday, 11 November 2026

వార్తలు

ఎమ్మార్‌ కేసులో నిందితుడికి బెయిల్‌ మంజూరు

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో నిందితుడు విజయరాఘవకు సీబీఐ కోర్టు ఈరోజు బెయిల్‌ మంజూరు చేసింది. రూ.లక్ష, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఎమ్మార్‌ కేసులో విజయరాఘవను జనవరి 28న సీబీఐ అధికారులు అరెస్టుచేశారు.

తెలంగాణ కవాతు ఆపే ప్రసక్తే లేదు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు ఆపే ప్రసక్తే లేదని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. టీఎన్జీవో భవన్‌లో ఏర్పాటు చేసిన ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం ఐకాసనేతలు మీడియాతో మాట్లాడారు. కవాతును శాంతియుతంగా…

నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: ఈరోజు సెన్సెక్స్‌ కేంద్ర రాజకీయ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం పెద్దఎత్తున ర్యాలీ కొనసాగిన మార్కెట్లో, ఈరోజు మాత్రం అస్థిరత్వం కన్పించింది. ప్రారంభంలో నమోదైన లాభాలను తుడిచిపెట్టి 79 పాయింట్ల నష్టంతో ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ…

గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆందోళన

మహబూబ్‌నగర్‌: గిట్టుబాటు ధర ఇవ్వటం లేదంటూ దేవరకద్రలో రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో ఆగ్రహించిన రైతులు ఈరోజు ఉదయం దేవరకద్ర మార్కెట్‌ యార్డు కార్యదర్శి యాదగిరిరెడ్డిపై దాడిచేశారు. అనంతరం హైదరాబాద్‌-రాయచూర్‌ అంతర్రాష్ట్ర రహదారిపై రాస్తారోకో…

పీసెట్‌ ప్రవేశాలకు 6 కళాశాలలు కేటాయింపు

గుంటూరు: అక్టోబరు 1 నుంచి 3 వరకూ పీసెట్‌ రెండో విడత వెబ్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు పీసెట్‌ కనీత్వనర్‌ పాల్‌ తెలిపారు. అక్టోబరు 5న సీట్ల కేటాయింపు, 8,9 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించారు. అక్టోబరు 11…

బీమారంగంలో ఎఫ్‌డీఐలను స్వాగతిస్తాం

ముంబయి: రాబోవు కాలంలో భీమా రంగం అభివృద్దికి పెట్టుబడులు చాలా అవసరమని, అందుకే ఈ రంగంలో విదేశీ పెట్టుబడులను తాము స్వాగతిస్తున్నామని ఐఆర్‌డీఏ ఛైర్మన్‌ జె. హరినారాయణ అన్నారు. ముంబయిలో జరుగుతన్న అసోచామ్‌ సదస్సుకు హాజరైన సందర్బంగా ఆయన…

కృష్ణాజలాల సరఫరాపై నివేదిక ఇవ్వండి . హైకోర్టు

  హైదరాబాద్‌. జంటనగరాలతోపాటు నల్గోండ , కృష్ణా, పశ్చిమగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తాగునీటి కోసం సరఫరా చేస్తున్న కృష్ణాజలాలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వాన్ని అదేశించింది. జంటనగరాల తాగునీటి అవసరాలకోసం కాకుండా సాగర్‌ నుంచి సాగునీటిని విడుదల…

‘ట్యాంకుబండ్‌పైనే ‘ తెలంగాణ మార్చ్‌’

హైదరాబాద్‌: నగరంలోని ట్యాంకుబండ్‌పైనే ‘ తెలంగాణ మార్చ్‌’ను నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ జేపీసీ ఛైర్మన్‌ కోదండరాం ప్రకటించారు. ఇవాళ టీఎస్‌జీవో భవన్‌లో జేఏసీ సమావేశమైన  అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ మార్చ్‌కు ‘సాగర్‌ హారం’ అని నామకరణం…

ధరల అదుపులో ప్రభుత్వం విఫలం రాఘవులు

  హైదరాబాద్‌ అర్టీసీ బస్‌ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో సీపీఎం అందోళన చేపట్టింది. అర్టిసీ క్రాస్‌రోడ్‌ వరకూ ప్రదర్శనగా వచ్చిన అపార్టీ నేతలు రాఘవులు, మధు వై. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గోన్నారు.

పుణెలో నాలుగంతస్తుల భవనం కూలి 5గురు మృతి

పుణె: పుణెనగరంలో ధంకావలి ప్రాంతంలో ఉన్న నాలుగంతస్తుల సోమనాధ్‌ భవనం కుప్పకూలటంతో 5గురు మృతి చెందారు. మరో 16మంది బవనం శిధిలాలకింద చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయం ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, ఆగ్నిమాపకసిబ్బంది. సహాయ చర్యలు…