Wednesday, 11 November 2026

వార్తలు

రామగుండం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీలోని ఐదవ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఐదు వందల మెగావాల్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సాంకేతిక లోపాన్ని సరిచేయడానికి నిపుణులు ప్రయత్నిస్తున్నారు.

కస్టమ్స్‌ అధికారుల పేరుతో చోరి

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో కస్టమ్స్‌ అధికారులమని చెప్పి ఇద్దరు దొంగలు రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్‌లో తనిఖీలు చేశారు. కౌంటర్లో ఉన్న రూ.1.45 లక్షలతో వారు పరారయ్యారు. మరో ఇద్దరు నిందితులను మాత్రం రైల్వే సిబ్బంది, ప్రయాణీకులు కలిసి…

తెదేపాలో చేరిన రావి వెంకటేశ్వరరావు

హైదరాబాద్‌: ముందుగా ప్రకటించిన ప్రకారమే గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈరోజు ఉదయం ఆయన మొదటి బాలకృష్ణతో భేటీ అయ్యారు. అనంతరం బాలకృష్ణ, రావి కలిసి చంద్రబాబుతో భేటీ అయి…

నేషనల్‌ పోలీస్‌ అకాడమీ వద్ద నర్సింగ్‌ అభ్యర్థుల ఆందోళన

హైదరాబాద్‌: నగరంలోని శివరాంపల్లిలోని నేషనల్‌ పోలీస్‌ అకాడమీ వద్ద నర్సింగ్‌ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. స్టాఫ్‌ నర్సుల ఎంపిక కోసం నిర్వహించాల్సిన రాత పరీక్ష ఆలస్యంపై వారు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

తెలంగాణ మార్చ్‌కు పూర్తి సంఘీభావం:దిలీప్‌కుమార్‌

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస ఈ నెల 30వ తేదీన చేపట్టే తెలంగాణ మార్చ్‌కు తాము పూర్తి సంఘీభావం ప్రకటిస్తున్నామని తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ సెక్రటరీ జనరల్‌ దిలీప్‌ కుమార్‌ తెలియజేశారు. ఇందుకు మద్దతుగా ఈ నెల 13వ…

రామానంద తీర్ధ వసతిగృహన్ని ప్రారంభించిన సీఎం, అజాద్‌

నల్గొండ: భూదాన్‌ పోచంపల్లిలో స్వామి రామానంద తీర్ధ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ వసతిగృహన్ని కేంద్ర మంత్రి కిరణ్‌కూమార్‌రేడ్డి ప్రారంభించారు అనంతరం భూదాన్‌ పోచంపల్లిలో జరిగే భూదానోద్యను సభలో పాల్గోనేందుకు బయలుదేరి వెళ్లారు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రోచైర్మన్‌

తిరుమల: ఇస్రోచైర్మన్‌ రాధకృష్ణన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పీఎన్‌ఎల్వీ ,సి21 ప్రయోగం విజయవంతమవడంతో స్వామిని దర్శించుకున్నట్లు అయన తెలిపారు. ఈ. నెల 22న జీశాట్‌ 10 ఉపగ్రహన్ని ప్రయోగించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు

కూడంకుళంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

తమిళనాడు: కూడంకుళంలో అణు విద్యుత్‌ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిషేదాజ్ఞలు ఉల్లంఘించి ఆందోళనలు కొనసాగిస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టారు. ఆణు విద్యుత్‌ కేంద్రానికి 1.5 కి.మీ దూరంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. మరోవైపు నిరసనకారులు దీక్షాస్థలం…

వియత్నాం వరదల్లో 16 మంది మృతి

హనోయ్‌:  భారీ వర్షాల కారణంగా వియత్నాంలో వచ్చిన వరదల్లో 16 మంది మృతిచెందారు. మరో 38 మంది గాయపడ్డారు. దేశ ఉత్తర, మధ్య ప్రాంతాల్లో వరద బీభత్సం 3,500 మందికి నిరాశ్రయులను చేసింది. వేలాది హెక్టార్లలో పంటలు, పండ్ల…

కావూరివి బెదిరింపు రాజకీయాలు: హరీష్‌రావు

హైదరాబాద్‌: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కాంగ్రెస్‌ ఎంపీ కావూరి చేస్తున్న వ్యాఖ్యల్లో చిత్తశుద్ది లేదని తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు. కావూరి లాంటి నేతలు తెలంగాణను అడ్డుకునేందుకు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2014లోపే తెలంగాణ సాధించాలనేది తమ…