Wednesday, 11 November 2026

వార్తలు

భద్రతపై అధికారులతో స్పీకర్‌ సమీక్ష

హైదరాబాద్‌: అసెంబ్లీ వర్షాకాల  సమావేశాల నేపథ్యంలో భద్రతపై స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ సమీక్ష చేపట్టారు. ఇంఛార్జి డీజీపీ దినేష్‌రెడ్డి, నగర పోలీసు ఉన్నతాధికారులతో స్పీకర్‌ భేటీ అయ్యారు. అసెంబ్లీ పరిసరాల్లో చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.

దుబాయ్‌లో కరీంనగర్‌ జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయ్‌లో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌ (43) ఈ నెల 2న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు ఈ రోజు సమాచారమందింది.  ఉపాధికోసం అప్పులు చేసి రెండేళ్ల క్రితం…

ఆజాద్‌తో పలువురి నేతల భేటీ

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల పర్యవేక్షకుడు గులాం నబీ ఆజాద్‌ను ఈ ఉదయం పలువురు నేతలు కలిశారు. లేక్‌వ్యూ అతిధిగృహంలో స్పీకర్‌ నాదెండ్ల, ఉపసభావతి మల్లుభట్టివిక్రమార్క, ఎంపీలు వివేక్‌, లగడపాటి తదితరులు ఆజాద్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిస్థితిని …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 61 పాయింట్లకు పైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 16 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత సెరీనా

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల పైనల్‌లో అమెరికన్‌ క్రీడాకారిణి సెరీనా విలియమ్స్‌ విజయం సాధించింది. టాప్‌సీడ్‌ ప్లేయిర్‌ అజరెంకాపై 6-2, 2-6, 7-5తో గెలుపొందింది.

సెంచూరియన్‌ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం

మెదక్‌: జిల్లాలోని జిన్నారం మండలం గడ్డిపోచారంలోని సెంచూరియన్‌ పరుపుల కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు ఎగిసినడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపకక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు.

తమ్మిలేరు జలాశయం లాకుల ఎత్తివేత

చాట్రాయి: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా.,పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులోని తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది జలాశయం లాకులు ఎత్తివేసి 14 వందల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఏలూరు, తమ్మిలేరు పరివాహక…

పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా పోటెత్తిన వరద నీరు

అశ్వరావుపేట: ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలంలో కురిసిన భారీ వర్షానికి పెద్దవాగు ప్రాజెక్టులోకి వరద నీరు పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి మూడు వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలారు. భారీవర్షంతో పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు…

ఎమ్మెల్యే ఇంట్లో భారీ చోరీ

ఒంగోలు: కొండపి ఎమ్మెల్యే జీవీ శేషు ఇంట్లో భారీ చోరీ జరిగింది. నిన్న రాత్రి ఒంగోలు పట్టణం క్లౌపేటలోని ఎమ్మెల్యే ఇంటి వెనకద్వారం పగలగొట్టి దొంగలు లోనికి ప్రవేశించారు. రూ. 20 లక్షల నగదు, రూ. 6 లక్షల…

ఎర్రగడ్డ బాటా చెప్పుల షాపులో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని ఎర్రగడ్డ బాటా చెప్పుల దుకాణంలో ఆదివారం అర్థరాత్రి ఆగ్నిప్రమాదం సంభవించింది. షాపులో ఉన్న చెప్పులకు, ఇతర సామాగ్రికి మంటలు అంటుకోవడంతో పెద్దఎత్తున్న మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి…