Wednesday, 11 November 2026

వార్తలు

పీఎం వ్యాఖ్యలపై మండిపడ్డా నారాయణ

హైదరాబాద్‌: తెలంగాణపై సీపీఐకి ఏకాగ్రత లేదన్న ప్రధాన్ని వ్యాఖ్యలపై అ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. తెలంగాణ ప్రాంతనాయకులకు, అంద్ర ప్రాంత నాయకులపై వైరుధ్యాలన్నాయన్న ప్రధాని తన డాధ్యతారాహిత్యాన్ని నిరుపించుకున్నారన్నారు.తెలంగాణ రాష్ట్ర సాదనలో భాగంగా పొరు యాత్రను…

మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైపులైను లీకేజీ

తూర్పుగోదావరి: జిల్లాలోని మామిడికుదురులో ఓఎన్‌జీసీ గ్యాస్‌ పైపులైన్‌ లీకవుతుంది. పెట్రోల్‌బంక్‌ వెనుకవైపున కొబ్బరి తోటలో ఉన్న ఈ పైపునుంచి గ్యాస్‌, ముడిచమురు పైకి ఉబికి వస్తున్నట్లు సమాచారం.

కురియన్‌, రోహిణీప్రసాద్‌ల మృతికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి

హైదరాబాద్‌: క్షీర విప్తవ పితామహుడు కురియన్‌, విశ్రాంత శాస్త్రవేత్త కొడవటిగంటి రోహిణీప్రసాద్‌ల మృతి పట్ల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్దికి కురియన్‌ చేసిన సేవలు మరువలేనివని ఆయన కొనియాడారు. అటామిక్‌ రేడియేషన్‌ డిటెక్షన్‌ నిపుణుడిగా రోహిణీప్రసాద్‌…

బంకరులో కూరుకుపోయి కార్మికుని మృతి

గోదావరిఖని: గోదావరిఖనిలోని గ్లోబల్‌ బొగ్గు శుద్ది కర్మాగారంలో పనిచేసే కార్మికుడు ప్రమాదవశాత్తూ బంకర్‌లోకూరుకుపోయి మృతి చెందాడు. ఉదయం విధి నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కమాన్‌పూర్‌ మండలం పెంచుకల్‌పేటకు చెందిన సాగంటిస్వామిగా మృతున్ని గుర్తించారు.

పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌

తిరుమల: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమత పర్యటన ముగించుకుని తిరుచానూరు చేరుకున్నారు. తిరుచానూరులో ఆయన శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.

హైదరాబాద్‌కు చేరుకున్న ఆజాద్‌

హైదరాబాద్‌: వివిధ కార్యక్రమల్లో పాల్గొనడానికి కేంద్ర మంత్రి, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ హైదరాబాద్‌కు వచ్చారు. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ కుమారై వివాహానికి ఆయన హాజరవుతారు. వినోబాబావే జయంతి సందర్భంగా నల్గొండ జిల్లా భూదాస్‌పోచంపల్లిలో జరిగే కార్యక్రమంలో…

ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా సుష్మాయే సరియైన వ్యక్తి: బాల్‌థాక్‌రే

న్యూఢిల్లీ: ఎన్టీఏ ప్రధాన మంత్రి అభ్యర్థిగా సుష్మాస్వరాజ్‌ సరియైన వ్యక్తి అని శివసేన అథినేత బాల్‌థాక్‌రే కితాబిచ్చారు. సుష్మాబీజేపీలో జనాకర్షణ  శక్తి ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. సుష్మా మాట్లాడేతీరు. ఆమె చతురత అందరినీ ఆకర్షస్తుందని అన్నారు.

నిరుద్యోగ భృతి ప్రారంభించిన యూపీ ప్రభుత్వం

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల నిరుద్యోగ భృతి ప్రకటించింది. లక్నోలో నిర్వహించిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి అఖిలేశ్‌ ఈ ప్రకటన చేశారు. సమాజ్‌వాది పార్టీ ఎన్నికల వాగ్దానమైన  ఈ పథకం కింద లబ్ధి పొందడానికి…

తెలంగాణ మార్చ్‌కు సన్నాహక యాత్ర

హైదరాబాద్‌: ఈనెల 30న నిర్వహించ తల పెట్టిన ‘ తెలంగాణ మార్చ్‌’కు సంబంధించి ఆదివారం సన్నాహక యాత్రను నిర్వహించారు. తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలో మాణికేశ్వర్‌నగర్‌ నుంచి యాత్ర సాగింది.

నందకం అతిథిగృహాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి

తిరుమల: శ్రీవారి దర్శనం చేసుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తితిదే ఆధ్వర్యంలో నూతనంగా నిర్శంచిన నందకం సముదాయాన్ని ప్రారంభించారు,. అనంతరం ధర్మగిరి ఎస్వీ వేదపాఠశాలను పరిశీలించారు. వేద విద్యార్థులు మంత్రోచ్చరణలు, శ్రీనివాస గద్యం పఠనాలను ప్రతిభావంతులైన విద్యార్థులను అభినందించారు.