Wednesday, 11 November 2026

వార్తలు

పాలమూరు జిల్లాలో దారుణం

మహబూబ్‌నగర్‌: అడ్డాకుల మండలం సుంకలోనిపల్లిలో దారుణం జరిగింది. కొండన్న అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసి చంపారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొండన్న కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

’60 టీఎంసీలు వాడుకునేందుకు బాబ్లీ నిర్మాణం’

న్యూఢిల్లీ: బాబ్లీ కేసు పూర్తిస్థాయి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది. 60 టీఎంసీల నీటిని అక్రమంగా వాడుకునేందుకే బాబ్లీ నిర్మాణమని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు తెలిపింది. బాబ్లీ విషయంలో మహారాష్ట్ర కోర్టు ధిక్కరణకు పాల్పడిందని…

సీఎం శ్రీశైలం పర్యటన రద్దు

శ్రీశైలం: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీశైలం పర్యటన రద్దయింది. నంద్యాలనుంచి ఇక్కడికి రావలసి ఉంది. శ్రీశైలం డ్యామ్‌ పరిశీలన, అమ్మవారి దర్శనం ఆయన పర్యటనలో ఉండగా వాతావరణం అనుకూలించకపోవటంతో ఆయన ఇక్కడికి రాకుండా నేరుగా హైదరాబాద్‌ వెళ్లిపోయారు. అదేవిథంగా మహానందిలో…

ఒడిషా అసెంబ్లీ ఎదుట ఉద్రిక్తత

ఒడిషా: బొగ్గు కుంభకోణానికి సీఎం నవీన్‌ పట్నాయకే కారణమని కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉదిక్త్ర పరిస్థితులు నెలకొనడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి  చేశారు. వాటన్‌ కెనాన్స్‌ కూడా…

‘జలయజ్ఞంపై ఈ నెలఖారులోగా ముఖ్యమంత్రికి నివేదిక’

హైదరాబాద్‌: రాష్ట్రంలో ‘జలయజ్ఞంపై ఈ నెలఖారులోగా ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తామని మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలియజేశారు.జలయజ్ఞంపై  మంత్రివర్గ ఉపసంఘం భేటీ ముగిసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పర్యావరణ, అటవీశాఖ అనుమతుల జాప్యంతో కొన్ని ప్రాజెక్టుల ద్వారా నీరు ఇవ్వలేకపోతున్నామని…

ఏరోబిక్స్‌ నిపుణురాలు దినాజ్‌ మరో రికార్డు

హైదరాబాద్‌: నగరానికి చెందిన ఏరోబిక్స్‌ నిపుణురాలు దినాజ్‌ వెర్వత్‌వాలా మరో రికార్డు సాధించారు. ఇప్పటికే 24గంటలు ఏరోబిక్స్‌ చేసి గిన్నిస్‌ రికార్డు సాధించిన దినాజ్‌ ఇవాళ 1800 మంది చిన్నారులతో మూడు నిమిషాల్లో రెండు రికార్డులు సాధించారు. జంప్‌జాక్‌,…

సీబీఐ అదనపు ఎస్పీ ఆర్‌.ఎం.ఖాన్‌ బదిలీ

హైదరాబాద్‌: ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ అక్రమాల కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న సబీఐ అదనపు ఎస్పీ ఆర్‌.ఎం.ఖాన్‌ బదిలీ అయ్యారు. ముంబయి ఆర్థిక నేరాల విభాగానికి ఖాన్‌ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో చైన్నై…

రాజ్యసభ రేపటికి వాయిదా

ఢిల్లీ: రెండోసారి వాయిదా పడి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన రాజ్యసభ తిరిగి ప్రారంభబైన వెంటనే రేపటికి వాయిదా పడింది. బొగ్గు కుంభకోణంపై విపక్షాల ఆందోళన వరసగా సభ వాయిదా పడడానికి కారణమైంది.

చంద్రబాబును కలిసిన తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు

ఢిల్లీ: పార్లమెంట్‌ హాలులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు కలిశారు.తెలంగాణపై త్వరగా లేఖ ఇవ్వాలని చంద్రబాబును ఎంపీలు కోరారు. దీనికీ చంద్రబాబు సానుకూలంగా స్పందించాడని తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు తెలియజేశారు.

గాలి బెయిల్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓబులాపురం గనుల కేసులో నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన నిందితులు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడగించింది. మాజీ జడ్జీ పట్టాభితో సహా ఏడుగురు నిందితులకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్‌…