Wednesday, 11 November 2026

వార్తలు

సాయంత్రం తెలంగాణ జేఏసీ స్టీరింగ్‌ కమిటీ భేటీ

హైదరాబాద్‌: సాయంత్రం 4 గంటలకు తెలంగాణ ఫిలింఛాంబర్‌లో టీజేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో సెప్టెంబర్‌ 17న నిర్వహించనున్న కరీంనగర్‌ కవాతు, సెప్టెంబర్‌ 30న నిర్వహించే చలో హైదరాబాద్‌ తదితర ఉద్యమ కార్యచరణ గురించి ఈ…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల స్టాండర్ట్‌ బంగారం ధర రూ.32,200గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.29,600లుగా ఉంది. కిలో వెండి ధర రూ.62,240గా ఉంది.

ఉద్రిక్తతకు దారితీసిన విద్యార్థి సంఘాల ఆందోళన

వరంగల్‌: వరంగల్‌ జాతీయ సాంకేతిక విద్యాసంస్థ నిట్‌లో ర్యాగింగ్‌ ను ఆరికట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఏబీవీపీ, టీఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు డైరెక్టర్‌ ఛాంబర్‌లోకి దూసుకెళ్లి ఓ అధ్యాపకునిపై…

విజయమ్మ దీక్ష ప్రారంభం

హైదరాబాద్‌: బోధనఫీజుల మొత్తన్ని ప్రభుత్వమే చెల్లించాలని వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ ఆందోళననకు దిగారు. ఇందిరాపార్కు వద్ద ఆందోళనకు దిగారు. వైకాపా ఎమ్మెల్యేలు, విద్యార్థులు సంఘీభావం తెలిపారు.

మంత్రి బాలరాజుకు గల్లాకు మధ్య మాటల వివాదం

విశాఖపట్నం: రోబోశాండ్‌ వర్క్‌షాపులో విశాఖలో కృత్రిమ ఇసుక తయారీపై జరుగుతున్న సమావేశంలో ఇసుక మాఫియా ఆగడాలపై మంత్రి బాలరాజు గనులశాఖ మంత్రి గల్లా అరుణకు ఫిర్యాదు చేశారు. ఇసుక తవ్వకాలపై గనులశాఖ సరైన చర్యలు తీసుకోవటంలేదని ఆవేదన వ్యక్తం…

విద్యుత్‌ కోతలకు నిరసనగా ఈపీడీసీఎల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన టీడీపీ

విశాఖపట్నం: రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు నిరసనగా ఈపీడీసీఎల్‌ కార్యాలయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. విద్యుత్‌ కోతలనుంచి రాష్ట్రన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

మన్మోహన్‌సింగ్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌తో భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

టర్కీ ఆయుధాల డిపోలో పేలుడు: 25 మంది మృతి

అంకారా: ఆయుధాల డిపోలో సంభవించిన పేలుడులో 25 మంది సైనికులు మరణించినట్లు టర్కీ దేశ రక్షణ శాఖ ప్రకటించింది. చేత్తో వినియోగించే గ్రెనేడ్స్‌ నిలవుంచిన డిపోలో బుధవారం అర్థ రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, పేలుడు కారణంగా తలెత్తిన…

రోబో శాండ్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమమలకు రాయితీ: మంత్రి అరుణ

విశాఖ: రోబో శాండ్‌ను ప్రోత్సహించేందుకు పరిశ్రమలకు ప్రత్యేక రాయితీ ఇవ్వనున్నట్లు మంత్రి గల్లా అరుణకుమారి తెలియజేశారు. రోబో శాండ్‌ వినియోగంపై విశాఖలో రాష్ట్ర గనుల శాఖ వర్కుషాపు నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మాట్లాడుతూ ఇసుక తవ్వకాలపై…

ఫ్రాన్స్‌లో పదిశాతం దాటిన నిరుద్యోగిత

పారిస్‌: ఫ్ఫ్రాన్స్‌లో పదిశాతం దాటిన నిరుద్యోగిత. యువతలో నిరుద్యోగిత మరింత ఎక్కువగా పెరుగుతోందని, జూన్‌ 30 తో ముగిసిన త్రైమాసికానికి ఆది 23.5 శాతానికి చేరిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ల్కెన దేశంలో 30 లక్షలకు పైగా నిరుద్యోగులున్నారు.