Wednesday, 11 November 2026

వార్తలు

బీసీ డిక్లరేషన్‌లో ఆ ఒక్కటి మినహా మిగిలిన వాటికి మద్దతు: శరద్‌యాదవ్‌

ఢిల్లీ: చట్ల సభల్లో మూడో వంతు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని జేడీయూ నేత శరద్‌ యాదవ్‌ తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో ఆ ఒక్కటి మినహా మిగిలిన వాటికి తమ మద్దతు ఉంటుందని…

మద్యం సిండికేట్ల కేసు వాయిదా

హైదరాబాద్‌: మద్యం సిండికేట్ల కేసు దర్యాప్తుపై ఏసీబీ హైకోర్టుకు స్థాయి నివేదిక సమర్పించింది. ఈ కేసు విచారణను రాష్ట్ర హైకోర్టు వచ్చేవారానికి వాయిదా వేసింది.

ఇంజినీరింగ్‌ యాచమాన్య కోటా దరఖాస్తుల స్వీకరణ

హైదరాబాద్‌: ఈ నెల 12 నుంచి 22 వరకు ఇంజినీరింగ్‌ యాజమాన్య కోటా దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని ఉన్నత విద్యామండలి ప్రకటించింది. సీట్ల వివరాలు ఆప్‌లోడ్‌ చేసేందుకు ప్రైవేటు కళాశాలలకు ఈ నెల 24 వరకు అవకాశం ఇస్తున్నట్లు…

ప్రభుత్వ పాఠశాలలో గుడుంబా నాటు సారా నిల్వ

హైదరాబాద్‌: పాఠశాల గుడుంబా గోడౌన్‌గా మారింది. సాక్షాత్తూ గురుపూజోత్సవం రోజునే ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో గుడుంబా గోడౌన్‌ నిర్వహిస్తున్నారనే సమాచారంతో చార్మినార్‌ ఎక్సైజ్‌ పోలీసులు దాడిచేయగా నాలుగు వేల గుడుంబా ప్యాకెట్లు,…

శరద్‌యాదవ్‌తో చంద్రబాబు భేటీ

ఢిల్లీ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో జేడీయూ నేత శరద్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. బీసీలకు చట్టసభలో రిజర్వేషన్‌ కోసం సహకరించాలని ఆయన ఢిల్లీలో జాతీయ నేతలతో వరుసగా భేటీ అవుతున్నారు.

బీసీ అజెండాతో ఢిల్లీ చేరిన చంద్రబాబు

ఢిల్లీ: బీసీ రిజర్వేషన్లు, ఎన్నికల్లో ఎక్కువసీట్లు తదితర అంశాలపై ఇతర జాతీయపార్టీల మద్దతు కూడగొట్టేందుకు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఈ రోజు మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. తెదేపా ఎంపీలతో కలిసి ఆయన ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు…

ఏఎస్పీ నవీన్‌కుమార్‌ కోసం పోలీసుల గాలింపు

రాజమండ్రి: క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు రంపచోడవరం ఏఎస్పీ నవీన్‌కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్‌ చేయటంతోపోలీసులు సస్పెన్షన్‌ ఉత్తర్వులు తీసుకుని రాజమండ్రిలోని అయన కోసం పోలీసులు ఇంట్లో గాలింపు జరిపారు. ఆయన కోసం పోలీసులు ఇంట్లో గాలింపు జరిపారు. ఆయన దొరకలేదు. ఆయనను…

కాంగ్రెస్‌ను పాతరేస్తేనే తెలంగాణ

అన్ని పార్టీలతో కలిసి ఉద్యమిస్తాం దీక్ష విరమణలో కిషన్‌రెడ్డి న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 5: తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన శత్రువని, ఆ పార్టీని తెలంగాణలో పాతరేస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమవుతుందని బిజెపి రాష్ట్రశాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. రాజకీయ…

రైతుబంధు పథకం ప్రారంభం

కర్నూలు: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్వేయమని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆయన కర్నూలు వ్యవసాయ మార్కెట్లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఇచ్చే 50 వేల రూపాయలను…

విశాఖకు చేరుకున్న భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు

విశాఖపట్నం: విశాఖలో శనివారం జరగనున్న టీ-20 మ్యాచ్‌లో పాల్గొనేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు విశాఖకు  చేరుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆటగాళ్లు బెంగుళూరునుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆటగాళ్లకు స్వాగతం పలికారు.…