Tuesday, 10 November 2026

వార్తలు

రూ.35వేలు మాత్రమే చెల్లిస్తాం

హైదరాబాద్‌: ఇంజనీరింగ్‌ కళాశాలల్లో బోధనా ఫీజు రూ.35వేలు మాత్రమే చెల్లిస్తామని మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. బోధనా ఫీజులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం ముగిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫీజు రూ.35వేలకు మించితే మిగిలిన అంశంపై…

కందాకు జ్యుడిషియల్‌ కస్టడీ

న్యూఢిల్లీ: ఎయిర్‌హోస్టెస్‌ గీతికాశర్మ ఆత్మహత్య కేసులో హర్యానా మాజీ మంత్రి గోపాల్‌ గోయల్‌ కందాకు స్థానిక న్యాయస్థానం 14 రోజుల జ్యూడిషియల్‌ రిమాండ్‌ విధించింది. మూడు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న కందాను పోలీసులు మంగళవారం న్యాయమూర్తి…

అహ్మదాబాద్‌కు బయలుదేరిన టీం ఇండియా

హైదరాబాద్‌: భారత్‌-న్యూజిలాండ్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్‌లో జరిగే రెండో టెస్టుకు ఇరు జట్లు హైదరాబాద్‌ నుంచి అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళ్లాయి. మొదటి టెస్టు విజయంతో వూపు మీదున్న ధోనీ సేవ అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.…

పట్టాభి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో పట్టాభి రామారావు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఓఎంసీ, ఎమ్మార్‌, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితులకు రిమాండును  సీబీఐ న్యాయస్థానం సెప్టెంబరు 11 వరకు పెంచింది.

పోలీస్‌స్టేషన్‌లో లాకవ్‌ డెత్‌?

విజయవాడ: విజయవాడ పోలీస్‌ స్టేషన్లో లాకవ్‌డెత్‌ జరిగినట్లు సమాచారం. వరకట్న వేథింపుల కేసులో అరెస్టెన శంకర్‌ను పోలీసులు చితకబాదగా అతను మరణించినట్లు భావిస్తున్నారు. గుట్టు చప్పుడు కాకుండా పోలీసులు శంకర్‌ మృతదేహాన్ని ప్రభుత్వాను పత్రికి తరలించినట్లు తెలస్తోంది.

యువక్రికెటర్లకు ఘనస్వాగతం

ముంబయి: అండర్‌ 19 ప్రపంచకప్‌ గెలుచుకున్న భారత క్రికెట్‌ జట్టు ఈ రోజు మధ్యాహ్నం భారత్‌ చేరుకుంది. ముంబయి విమానాశ్రయానికి చేరుకున్న యువత జట్టు సభ్యులను చూడగానే హర్షధ్వానాలు చేసింది.

ఏసీబీకి చిక్కిన అవినీతి చేప

ప్రకాశం: ముండ్లమూరు తాసీల్దారు మల్లీకార్జున ప్రసాద్‌ ఈ రోజు చౌకధరల దుకాణం డీలర్‌ నుంచి 3,700 లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు.

అసెంబ్లీలోని భవనంపైకి ఎక్కి నిరసనలు

హైదరాబాద్‌: అసెంబ్లీలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టకుండా తమను అడ్డుకున్నారన్న ఆగ్రహంతో తెదేపా ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఆందోళనకు దిగారు. అసెంబ్లీలోని ఓ భవనంపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. అధికారులు ఆమెకు నచ్చజెప్పడంతో కొదిసేపు నిరసన…

నదిలో జీపు బోల్తా…16 మంది గల్లంతు

రాంచీ: జార్ఖండ్‌లోని ఉత్తర కోయల్‌ నదిలో ఓ జీపుఉ బోల్తా పడింది. ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. ఘటనాస్థలనికి చేరుకున్న అధికారులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మంత్రి దానం కుడిచేతికి గాయం

హైదరాబాద్‌: కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్‌ కుడిచేతికి గాయమైంది. ఆయనకు యశోద ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేసి కుట్లు వేశారు. చికిత్స కోసం ఉదయం నుంచి రెండు సార్లు మంత్రి ఆసుపత్రికి వచ్చారు. అయితే మంత్రి గాయానికి…