Tuesday, 10 November 2026

వార్తలు

రాజీవ్‌ బాటలో ముందుకు సాగాలి: ఉప ముఖ్యమంత్రి

మెదక్‌: రాజీవ్‌ చూపిన బాటలో యువత ముందుకు సాగాలని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. విద్యారంగంపైన, సాంకేతిక ప్రగతిపైన రాజీవ్‌కు ఆనాడే స్పష్టమైన అవగాహన ఉండేదని ఆ ప్రకారమే ఆయన ముందుకుసాగారని గుర్తుచేశారు. సంగారెడ్డిలో జరిగిన రాజీవ్‌గాంధీ…

విషజ్వరాలతో ముగ్గురు మృతి

వరంగల్‌: జిల్లాలో విషజ్వరాల బారిన పడి ముగ్గురు మృతి చెందారు. పరకాల మండలం లక్ష్మీపురంలో విషజ్వరానికి గురై వరంగల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ…పల్లెబోయిన శ్రీలత, దానం పుల్లయ్య, ఓదెలు అనే వ్యక్తులు మృత్యువాతపడారు. వీరు ముగ్గురు ఒకే గ్రామానికి…

రుయా ఆస్పత్రిని పరిశీలీస్తున్న బాబు

తిరుపతి: రుయా ఆస్పత్రిని ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఇవాళ సందర్శించారు. ఆస్పత్రిలో చిన్నారులు మృతిచెందడంపై ఆయన ఆరా తీశారు. ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు సరిపోయేలా వైద్యులు లేరని ఆయన విమర్శించారు. వైద్యులను వివరాలు అడిగితెలుసుకున్నారు.

ఇంజనీరింగ్‌ కళాశాలల ఆఫిడవిట్ల సమర్పణకు మరో అవకాశం

హైదరాబాద్‌: ఏఎఫ్‌ఆర్‌సీకి అఫిడవిట్లు సమర్పించని ఇంజినీరింగ్‌ కళాశాలలకు మరో అవకాశం కల్పించారు. రేపటినుంచి వారు ఆఫిడవిట్లు దాఖలు చేయవచ్చు. ఈ నెల 26వరకు వచ్చే ఆఫిడవిట్లను ఏఎఫ్‌ఆర్‌సీ ఆమోదిస్తుంది.

గోరింటాకు వదంతుల ఘటనలో ఇద్దరి అరెస్టు

విజయవాడ: గోరింటాకు కోన్‌ పెట్టుకున్నవారికి ఇన్‌ఫెక్షన్‌ వస్తోందని వదంతులు వ్యాపింపజేసిన ఘటనలో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మన్‌పసంద్‌ దుకాణం నిర్వాహకులను ఇద్దరిని ఆరెస్టుచేసి విచారిస్తున్నారు.

కడెం జలాశయంలో 700 అడుగులకు చేరిన నీటిమట్టం

ఆదిలాబాద్‌: ఎగువప్రాంతంనుంచి వచ్చి చేరే వరదనీరు పెరగటంతో జిల్లాలోని కడెం జలాశయంలో నిటిమట్టం పెరిగింది. ఇది 700 అడుగులకు చేరింది దీంతో రెండు గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు.

నేడు హస్తినకు వెళ్లనున్న బొత్స

హైదరాబాద్‌: రాష్ట్ర రాజకీయాలపై అదిష్టాణంతో చర్చించేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వెళ్లనున్నరు. మంత్రి ధర్మాన రాజీనామా వ్యవహరం. పెండింగ్‌లోఉన్న నామినెటెడ్‌ పదవుల భర్తిపై ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని సమాచారం. ఇదే వ్యవహారంపై చర్చించాడానికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి…

నేడు రుయా ఆస్పత్రిక చంద్రబాబు

తిరుపతి: తిరపతి పట్టణంలోని రుయా చిన్న పిల్లల ఆస్పత్రిలో జరిగిన పసిపిల్లల మరణాలపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేడు ఆ ఆస్పత్రిని సందర్శించనున్నారు. రుయా ఆస్పత్రిలో ఆదివారం ఐదుగురు చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో 21…

ఉప్పపోగుతున్నా గోదావరి నది

కరీంనగర్‌: జిల్లాలోని మహాముత్తారం, కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రవతి నదులలోకి వరదనీరు వచ్చి చేరుతోంది, గోదావరి నది వరదల వల్ల మహాదేవ్‌పూర్‌ మండలంలోని 20…

తెలంగాణకు భారీ వర్షసూచన

హైదరాబాద్‌: రాష్ట్రంలో సోమవారం రాత్రి వరకు తెలంగాణ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఆవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంత్ర అదికారులు తెలియజేశారు.