Sunday, 8 November 2026

వార్తలు

ముందంజలో సైనా

లండన్‌: బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ తొలి గేమ్‌లో భారత క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ ముందంజలో ఉంది. డెన్మార్క్‌-క్రీడాకారిణి టిమ్‌ బాన్‌పై 21-15తో సైనా గేమ్‌ కైవసం చేసుకుంది.

హైదరాబాద్‌ వాసులకు విద్యుత్తు కోతల నుంచి వూరట

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్తు వినియోగం తగ్గింది. ఈ నేపథ్యంలో సీపీడీసీఎల్‌ గ్రేటర్‌ పరిధిలో కోతలను కూడా తగ్గించింది. రోజుకు మూడుగంటలుగా ఉన్న విద్యుత్‌ కతను గంటకు కుదిరచారు. నగరంలో శుక్రవారం నుంచి ఒకే సారి…

నా వ్యాఖ్యల్ని వక్రీకరించారు.: చందనాఖాన్‌

హైదరాబాద్‌: పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ప్రాథమిక విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చందనాఖాన్‌ వివరణ ఇచ్చారు. పాఠశౄల, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత విద్యార్థులపై ఉందని మాత్రమే తాను అన్నట్లు వివరించారు. విద్యార్థులే వాటిని శుభ్రం…

ట్రాక్టర్‌ను ఢీకొన్న రైల్వే టవర్‌ కార్‌

నెల్లూరు: నెల్లూరు జిల్లా కావలి మండలం ముసునూరు వద్ద రైల్వే టవర్‌ కార్‌ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గేట్‌మన్‌ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.…

ఫీజులపై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, ఇతర సాంకేతిక, ఉన్నత విద్యాకోర్సులకు సంబంధించి ఫీజుల నిర్ణయంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఉన్నతాధికారులు సమావేశమై దీనితో ముడిపడివున్న ఆంశాలన్నింటిని చర్చించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆనం…

హర్యానాలో రోడ్డుప్రమాదం: 10మంది మృతి

హర్యానా: హర్యానాలోని లాడ్వా జిల్లా బంగన్‌లో బస్సు, వ్యాన్‌ ఢీ కొన్న ప్రమాదంలో పది మంది మరణించారు. ఐదుగురికి గాయాలయ్యాయి. రాజస్థాన్‌ నుంచి లాడ్వాకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ఎమ్మార్‌ కేసులో మరో 43కీలక పత్రాలు సేకరించాం

హైదరాబాద్‌: ఎమ్మార్‌ కేసులో మరో 43 కీలక పత్రాలు సేకరించినట్లు కోనేరు బెయిల్‌ పిటిషన్‌పై వాదనల్లో సీబీఐ పేర్కొంది. ఈకేసులో మరో 8మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేశామని సీబీఐ పేర్కొంది. విల్లాల అమ్మకాలతో అర్జించిన సొమ్మును సౌత్‌ఎండ్‌…

బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మోపిదేవి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టైన మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ ఈరోజు సీబీఐ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.

నీలిమ పోస్టుమార్టం పూర్తి

హైదరాబాద్‌: మంగళవారం రాత్రి మరణించిన సాఫ్‌టవేర్‌ ఉద్యోగిని నీలిమ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. వారంలోగా నివేధిక ఇస్తామని వైద్యులు తెలిపారు. నెలరోజుల్లో విస్రా నివేదిక వస్తుందని అందులో పూర్తి వివరాలు తెలుస్తాయని వైద్యులు పేర్కొన్నారు.

ప్రజలు రాజకీయ ప్రత్యామ్నాయం కోరుతున్నారు: అన్నాహజారే

న్యూఢిల్లీ: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో ప్రభుత్వం విఫలమైందని అందుకే ప్రజు తమ నుంచి రాకీయ ప్రత్యామ్నాయం ఆశిస్తున్నారని అన్నా హజారే అన్నారు. ఈ రోజుతో అన్నా దీక్ష అయిదవరోజుకు చేరింది. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయపార్టీ పెట్టడంలో…