Sunday, 8 November 2026

వార్తలు

యాజమాన్య కోటా సీట్ల భర్తీపై స్టే

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ ఆంశంపై హైకోర్టులో వేసిన వేర్వేరు పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. యాజమన్యా కోటా సీట్ల భర్తీపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సీ కేటగిరి సీట్ల భర్తీకి జస్టిస్‌ ఈశ్వరయ్య…

అటవీ సిబ్బందిపై దాడిచేసిన స్మగ్లర్లు

వరంగల్‌: నర్సంపేట మండలం సర్వాపురంలో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడి చేశారు. అక్రమ కలప పట్టుకునేందుకు వెళ్లిన స్లయింగ్‌ స్క్వాడ్‌ స్బిబందిపై వీరు దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి.

ఉపాధిలో మరో 50రోజుల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ అబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50రోజుల పని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వీహెచ్‌ మౌనవ్రతం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో మేథోమధనం చేయాలని డిమాండ్‌ చేస్తూ 28న ఉదయం 10:30 నుంచి గాంధీభవన్‌లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మౌనవ్రతం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జగన్‌ అవినీతి గురించి మంత్రుల కమిటీ ఎందుకు…

కర్నూలులో ఇద్దరి హత్య

కర్నూలు: కర్నూలులోని మానస దాబాలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఏడుగురు మిత్రులు కలిసి దాబాకు వెళ్లారు. వీరిపై 12మంది ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. వీరిలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మృతులు కర్నూలు శ్రీరాంనగర్‌ వాసులు దొరస్వామిరాజు,…

తివారీ డీఎస్‌ఏ నివేదిక వెల్లడి

ఢిల్లీ: పితృత్వం కేసులో ఎన్డీ తివారీ డీఎస్‌ఏ నివేదికను ఢిల్లీ హైకోర్లు బహిర్గతం చేసింది. రోహిత్‌ శేఖర్‌ తండ్రి తివారీయే అని నిర్థారణ కావడం సంతోషంగా ఉందని రోహిత్‌ శేఖర్‌ అన్నారు. ఎన్డీ తివారీ తన తండ్రి అని…

ఎన్‌ఐఆర్‌డీలో జిల్లా కలెక్టర్లతో భేటీ

హైదరాబాద్‌: నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో యువత ఉద్యమాల పట్ల ఆకర్షతులు కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ గ్రామీణాభివృద్ధి మండలి (ఎస్‌ఐఆర్‌డి) కార్యాలయంలో రెండురోజుల సెమినార్‌ ప్రారంభమైంది. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ఏర్పాటు చేసిన ఈ…

ఉపాధిలో మరో 50 రోజల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50 రోజుల పని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

తొలి శుక్రవారం ప్రశాంతంగా రంజాన్‌ ప్రార్థనలు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం ప్రారంభమయ్యాక వచ్చిన తొలి శుక్రవారం నేడే కావడంతో మక్కామసీదులో ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ముస్లిం సోదరులు  అధిక సంఖ్యలో ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. నగర పోలీసు…

ఆరుగురు విద్యార్థులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బిజనూరులో మీనాక్షి శిశుమందిర్‌ పాఠాశాలపై కస్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు…