Friday, 6 November 2026

వార్తలు

భారత వైద్య మండలి అధికారులతో కొండ్రు మురళి భేటీ

ఢిల్లీ: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కొండ్రు మురళి శుక్రవారం భారతి వైద్య  మండలి అధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని అన్ని  ప్రాంతాలను సమాన దృష్టితో చూస్తామని, రాష్ట్రంలోని  అన్ని వైద్య కళాశాలలకు వైద్య కళాశాలలకు ప్రభుత్వ హామి ఇస్తూ…

9 శాతం వృద్ధిరేటు సాధ్యం కాకపోవచ్చు

ఢిల్లీ: నానాటికీ క్షీణిస్తున్న ప్రపంచ ఆర్థిక  పరిస్థితులను గమనిస్తోంటే వచ్చే ఐదేళ్లలో 9 శాతం సగటు  వృద్ధి రేటు సాధించడం సాధ్యంకాకపోవచ్చని ప్లానింగ్‌ కమిషన్‌ డిప్యూటీ చైర్‌పర్సస్‌ మాంటెక్‌ సింగ్‌ అహ్లువాలియా అన్నారు. 8-8.5 శాతం మాత్రమే సాధ్యమవుతుండవచ్చని…

బొత్సకు 14 రోజుల రిమాండ్‌

శ్రీకాకుళం: లక్ష్మింపెటలో దళితులపై దాడి ఘటనలో అరెస్టు చేసిన బొత్సవాసుదేవనాయుడును పోలీసులు పాలకొండ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. అనంతరం పోలీసులు వాసుదేవనాయుడిని విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు.

నల్గొండలో రెండురోజులపాటు అఖిలపక్ష పర్యటన

నల్గొండ:జిల్లాలో ఈరోజురేపు అఖిలపక్ష ఎమ్మేల్యేలు పర్యటించనున్నారు.జిల్లాలోని ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతాలలో వారు పర్యటస్తారు.ఈ పర్యటనలో ఆయా పార్టీల ఫ్లోర్‌ లీడర్లతోపాటు స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కూడా పాల్గొంటారు.

మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

అదిలాబాద్‌ : లక్ష్మణచాంద మండలంలో మధ్యాహం భోజనం వికటించి విద్యార్థులు అస్వసత్థకు గురైన ఘటన నర్సాపూర్‌ డబ్ల్యూ ప్రాథమికోన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. భోజనం చేసిన వారిలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. భోజనంలో బల్లి పడినట్లు నిర్వహకులు…

హైదరాబాద్‌-ముంబయి జాతీయ రహదారిపై స్థంభించిన రాకపొకలు

జహీరాబాద్‌రూరల్‌:జహీరాబాద్‌ మండలం హుగ్గెళ్లి గ్రామ సమీపంలో 65వ నెంబరు జాతీయ రహరదారిపై గల కల్వర్టును హైదరాబాద్‌వైపు వెళుతున్న లారీ ఢీకొట్టి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.లారీ డ్రైవర్‌లు తీవ్రంగా గాయపడటంతో వారిని జహీరాబాద్‌ ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు.ప్రమాదంతో హైదరాబాద్‌-ముంబయి…

అక్రమంగ ఇసుక తరలిస్తున్న 6వాహనాలను పట్లుకున్న రెవెన్యూ అధికారులు

హైదరాబాద్‌: భద్రాచలం మండల కేంద్రంలోని కొల్లుగూడెం గ్రామంలో రెవెన్యూ అధికారులు అక్రమంగ ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పట్లుకున్నారు. యజమానులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు భద్రచలం తహసీల్దార్‌ తెలిపారు. వాహనాలను పోలీసు స్టేషన్‌కు తరలించారు.

జగ్జీవన్‌రామ్‌కు ఘన నివాళులు

హైదరాబాద్‌: బాబూ జగ్జీవన్‌రామ్‌ 26వ వర్థంతిని పురస్కరించుకుని దళిత సంఘాలు హైదరాబాద్‌లో ఘనంగా నివాళులర్పించాయి. బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి సికింద్రాబాద్‌ ఎంపీ అంజయ్‌కుమార్‌ యాదవ్‌, నగర డిప్యూటి మేయర్‌లతో పాటు పలు దళిత సంఘాల నాయకులు పూలమాలలు వేసి…

లారీని ఢీకొన్న కారు

శ్రీకాకుళం:జిల్లాలో ఈరోజు జరిగిన ఓరోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు.శ్రీకాకుళం జిల్లా నరసన్న పేట మండలం దేవాది వద్ద ఈ దుర్ఘటన జరిగింది.రోడ్డుపక్క ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టటంతో ఒకరు మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా…

మద్యం విధానంపై హైకోర్టు తీర్పు రిజర్వు

హైదరాబాద్‌: మద్యం కొత్త విధానంలో  లాటరీ పద్దతిపై హైకోర్టులో వాదనలు పూర్తియ్యాయి. దీనిపై తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. రాష్ట్రప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన లాటరీ విధానంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే.