Wednesday, 4 November 2026

వార్తలు

అపూర్వ విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు

ఉప ఎన్నికల్లో వైకాపా విజయాన్ని అందించిన ఓటర్లకు వైఎస్‌ఆర్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గెలుపు వలన జగన్‌ నిర్ధోషని తీర్పునిచ్చారని కాంగ్రెస్‌, టిడిపి కలిసి మమ్మల్ని ఓడించాలని సర్వశక్తుల ఎన్నో ప్రలోబాలు…

జగన్‌ అరెస్ట్‌ కొంప ముంచింది:వాయలర్‌ రవి

ఢిల్లీ: జగన్‌ అరెస్ట్‌ కావటం వలనే ఉప ఎన్నికల్లో వైకాపాను విజయం వరించిందని కాంగ్రెస్‌ సినియర్‌ నేత వాయలర్‌ రవి అన్నారు. అరెస్ట్‌ కావాటం వలన సానుభూతి బాగా పనిచేసి జగన్‌ పార్టీ గెలిచిందని కాంగ్రెస్‌ను బలోపేతం చేయాడానికి…

సోనియాకు శంకర్రావు లేఖ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడానికి, కాంగ్రెస్‌ ఓటమికి కాంగ్రెస్‌ బాధ్యత కాదని, కిరణ్‌కుమార్‌ రెడ్డి వల్లే ఓటమి చవిచూశామని సీిఎంను, పీసీసీ అధ్యక్షుడును మార్చాలని కాంగ్రెస్‌ మాజీ మంత్రి శంకర్రావు అన్నారు…

పరకాలలో కాంగ్రెస్‌కు అయిదవ స్థానం

వరంగల్‌: అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండవ స్థానంలో నిలవగ టీడీపీ మూడవ స్థానంలో నిలిచింది. బిజేపీ నాలుగవ స్థానంతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ అయిదవ స్థానంలో నిలిచింది.

నెల్లూరు లోక్‌సభ స్థానంలో మేకపాటి విజయం

నెల్లూరు:నెల్లూరు పార్లమెంట్‌ స్థానానికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి గెలుపొందారు. ఆయన రెండు లక్షల 90 వేల పై చిలుకు ఓట్ల ఆధిక్యంతో సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్‌ అభ్యర్ధి సుబ్బిరామిరెడ్డి పై విజయం సాధించారు.

ఒంగోలులో వైకాపా విజయం

ప్రకాశం: ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి 27,403 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వైకాపాకు 77,125 ఓట్లు రాగా,తెదేపాకు 49,649, కాంగ్రెస్‌కు 23,114 ఓట్లు పోలయ్యాయి.

ఒంగోలులో వైకాపా ముందంజ

ప్రకాశం: ఒంగోలు నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో వైకాపా ముందంజలో ఉంది. 15వ రౌెండ్‌ పూర్తయ్యే సరికి తెదేపాపై 24,556 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

పరకాలలో టీఆర్‌ఎస్‌ విజయం

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి గెలుపోందారు. అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఫలితం బిక్షపతిని వరించింది. కొండా సురేఖ అత్యంత పోటి ఇచ్చినప్పటికి విజయం బిక్షపతిని వరించింది.

నెల్లూరులో వైకాపా ముందంజ

నెల్లూరు:నెల్లూరు లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ఈ ఉదయం ప్రారంభమైంది. పది రౌండ్ల లెక్కిదపు ముగిసేరికి వైకాపా అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి 1,79,187 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు.