Wednesday, 4 November 2026

వార్తలు

పరకాల ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ

వరంగల్‌: పరకాల విజయం ఎవరిని వరించనుంది అనేది ఉత్కంట నెలకొంది 18వ రౌండ్‌లో 556 ఓట్ల ఆధిక్యంలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి సాగుతున్నారు. ప్రస్థుతం చివరి రౌండ్‌ లెక్కింపు జరుగుతుంది.

గెలుపొందిన అభ్యర్థులు వీరే

ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 స్థానాల్లో వైకాపా గెలుపొంది. రెండు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతుండగా. కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో  విజయం సాధించింది. పరకాలలో తెరాస వైకాపా మధ్య పోటి నెలకొంది. గెలుపొందిన అభ్యర్థుల వివరాలు: నరసన్నపేట: ధర్మానకృష్ణదాస్‌-వైకాపా…

జగన్‌ నాయకత్వన్ని ప్రజలు కోరుకుంటున్నారు:షర్మిల

వైకాపా గెలుపుతో ప్రజలు జగన్‌ నాయకత్వన్ని కోరుకుంటున్నారని పార్టీ గెలుపు కోసం పనిచేసిన నాయకులందరికి పేరే పేరున ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఇది ప్రజా విజయం:విజయమ్మ

జగన్‌ నిర్ధోషని ప్రజలు తీర్పునిచ్చారని వైఎస్‌ విజయమ్మ అన్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజలు వైఎస్‌ రాజశేేఖర్‌ రెడ్డిని మరచిపోలేరని పార్టీ గెలుపుకోసం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

పరకాల 17వ రౌండ్లో కొండా ముందంజ

వరంగల్‌: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.

పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్‌ఎస్‌

వరంగల్‌: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్‌ఎస్‌ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.

రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలుపు

హైదరాబాద్‌: ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ రెండు చోట్ల విజయం సాధించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం 18 స్థానాల్లో  పోటి చేసినప్పటికీ  రెండు స్థానాలతో ఆ పార్టీ సరిపెట్టుకుంది.

పరకాలలో 16రౌండ్లు పూర్తి

పరకాల: పరకాలలో టిఆర్‌ఎస్‌ అభ్యర్థి బిక్షపతి 267 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైకాపా అభ్యర్థి కొండా సురేఖ గట్టి పోటినిస్తున్నారు.

అవినీతి అబ్బద్దపు ప్రచారమే మా కోంప ముంచింది:తలసాని

హైదరాబాద్‌: జగన్‌పై అవినీతి అబద్దపు ప్రచారంవల్లే మేం ఓడిపొయామని ఈ అవినీతి ప్రచారమే మా కొంప ముంచిదని టిడిపి సీనియర్‌ నేత తలసాని శ్రీనివాస్‌ అన్నారు.