Sunday, 15 November 2026

హైదరాబాద్

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జశ్వంత్‌సింగ్‌ నామినేషన్‌

ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీయే అభ్యర్థిగా భాజపా నేత జశ్వంత్‌సింగ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. యూపీఏ అభ్యర్థి హమీద్‌ అన్సారీ బుధవారం నామినేషన్‌ దాఖలు చేసిన సంగతి విదితమే.

యూపిఏలోనే కొనసాగుతాం : ప్రపుల్‌ పటేల్‌

న్యూఢిల్లీ : తాము ఎప్పటినుంచో యూపీఏలో భాగసామ్యపక్షంలో ఉన్నామని ఇకాముందు కూడా అలాగే కొనసాగతామని  ఎన్సిపీ నేత కేంద్రమంత్రి ప్రపుల్‌ పటేల్‌ తెలిపారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తమపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు.…

నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌పై తీర్పు వాయిదా

హైదరాబాద్‌: ఎమ్మార్‌ప్రాపర్టీస్‌ కేసులో రిమాండ్‌లో ఉన్న నిమ్మగడ్డ వరప్రసాద్‌ బెయిల్‌ కోసం పిటీషన్‌ వేశారు. నిమ్మగడ్డ బెయిల్‌ పిటీషన్‌పై కోర్టు విచారణను ఈ నెల 30కి వాయిదా పడింది.

సెల్‌ టవర్‌ ఎక్కిన టీఆర్‌ఎస్వీ విద్యార్థులు

హైదరాబాద్‌:కూకట్‌పల్లిలోని ఓ  సెల్‌టవర్‌పైకి ఎక్కిన టీఆర్‌ఎస్వీ విద్యార్థులు నిరసన నినాదాలు చేశారు. సిరిసిల్లలో విజయమ్మ ఒక్క రోజు దీక్షకు నిరసనగా వారు ఈ నిరసనకు దిగారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పకుండా విజయమ్మ సిరిసిల్లలో పర్యటించేది లేదని వారు…

రైల్వేస్టేషన్లో మృతదేహం లభ్యం

విశాఖపట్నం : స్థానిక రైల్వేస్టేషన్లో ప్లాస్టిక్‌ సంచుల్లో లభ్యమైన మృతదేహం కేసులో పోలిసులు దర్యాప్తు ప్రారభించారు. రెండు సంచుల్లో  11 ముక్కలుగా దొరికిన అవయవభాగాలపై దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతలలోని రాయపూర్‌ ప్రాంతవాసిగా భావిస్తున్నారు. దీంతో ఈ…

నిజామాబాద్‌ ఎమ్మెల్సీగా కాంగ్రెస్‌ గెలిచినట్లు హైకోర్టు తీర్పు

హైదరాబాద్‌: నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలిచినట్లు హైకోర్టు ఈరోజు తీర్పు ఇచ్చింది. గతంలో అక్కడ ఎమ్మెల్సీగా తెరాస అభ్యర్థి నర్సారెడ్డి గెలిచారు. అయితే ఆ ఎన్నిక చెల్లదని తిరిగి లెక్కింపు జరపాలని కాంగ్రెస్‌ అభ్యర్థి…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మార్కెట్లో ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,500 పలికింది. 22   క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 28,600గా ఉంది. కిలో వెండి ధర 52,250 రూపాయలు ఉంది.

మహేశ్‌బాబు, నమ్రతలకు కుమార్తె

హైదరాబాద్‌: ప్రముఖ కధానాయకుడు మహేశ్‌బాబు, నమ్రత దంపతులకు ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల 15 నిమిషాలకు  అమ్మాయి పుట్టింది. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో నమ్రతకు సుఖప్రసవమైందని తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈ…

రేషన్‌ తరహాలో దర్శినానికి నేను వ్యతిరేకం: కనుమూరి

తిరుపతి: రేషన్‌ తరహాలో శ్రీవారి దర్శినానికి తాను వ్యతిరేకమని భక్తి, తృప్తిని బట్టి భగవంతుడిని ఎన్ని సార్లు అయినా దర్శించుకోవచ్చని టీటీడీ ఛైర్మన్‌ కనుమూరి  బాపిరాజు అన్నారు. తిరుమలలో ఈ రోజు టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం అయింది.…

జేఎన్‌టీయూ వద్ద విద్యార్థిసంఘాల ఆందోళన

హైదరాబాద్‌: జేఎన్‌టీయూలో ఈ రోజు ప్రారంభమైన ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. జీవో నెంబర్‌ 136 ప్రకారం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లను ఆన్‌లైన్‌లో భర్తి చేయాలని, తెలంగాణ మెడికల్‌ కాలేజిల్లో సిట్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. కౌన్సిలింగ్‌…