Sunday, 8 November 2026

తెలంగాణ

రిలయన్స్‌ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): బంజారాహిల్స్‌లో రిలయన్స్‌ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా చేసింది. కేబీబేసిన్‌లో అక్రమ వ్యాపారాలు చేస్తున్న రిలయన్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది.

10 ఏళ్ల బాలికపై యువకుడి అత్యాచారం

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని చందంపేట మండలం ఎనమలమందలో దారుణ సంఘటన జరిగింది. 10 ఏళ్ల బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లిదండ్రుల ఫర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.

జూబ్లీహిల్స్‌ కార్పోరేటర్‌ ఇంట్లో చోరీ

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ కార్పోరేటర్‌ నరసింగరావు ఇంట్లో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు రూ. 4లక్షల విలువైన బంగారు అభరణాలను అపహరించారు.

మోడల్‌ స్కూల్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి

నల్లగొండ,(జనంసాక్షి): జిల్లాలోని నడిగూడెం మండలం కర్విరాలలో మోడల్‌స్కూల్‌ను కేంద్రమంత్రి పల్లంరాజు ప్రారంభించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

సహాయక చర్యలు వేగవంతం చేయాలి: సీఎం కిరణ్‌ కుమార్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): డెహ్రాడూన్‌ యాత్రికులను రాష్ట్రానికి తీసుకువచ్చే యత్నాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మంత్రులతో సమీక్షించారు. ఢిల్లీకి పంపిన మంత్రుల బృందం బలరాంనాయక్‌, శ్రీధర్‌బాబు, దానం నాగేందర్‌లతో సీఎం మాట్లాడారు. యాత్రికులను స్వస్థలాలకు చేర్చేందుకు అన్ని చర్యలు వేగవంతం చేయాలని…

యాత్రికులను ప్రాణాలతో రక్షించటమే ధ్యేం: ఆర్మీచీఫ్‌

హైదరాబాద్‌ : ఉత్తరాఖండ్‌లో రేపు వాతావరణంలో మార్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ నివేదిక ఇచ్చినట్లు ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ తెలిపారు. గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతికూల వాతావరణం వల్ల…

నేడు దుండిగల్‌ రానున్న ఆర్మీ చీఫ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిక్రమ్‌సింగ్‌ ఈ రోజు ఉదయం దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో జరిగే కంబైన్డ్‌ గ్యాడ్యుయేషన్‌ పరేడ్‌లో హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌ ఫోర్సు అకాడమీలో విమాన విన్యాసాలు అలరించనున్నాయి.

విద్యాపక్షోత్సవాలను ప్రారంభించిన కేంద్రమంత్రి

నల్గొండ : నల్గొండ జిల్లా నడిగూడెం మండలం కరివిరాలలో విద్యాపక్షోత్సవాలను కేంద్ర మంత్రి పల్లంరాజు ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

మెదక్‌ జిల్లాలో యువకుడి సజీవ దహనం

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్‌ మండలం శివ్యంపేటలో ప్రమాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్‌(29) సజీవ దహనమయ్యాడు.

మెదక్‌ జిల్లాలో యువకుడి సజీవ దహనం

మెదక్‌,(జనంసాక్షి): జిల్లాలోని పుల్కల్‌ మండలం శివ్యంపేటలో మ్రాదవశాత్తు కిరాణా దుకాణం దగ్దమైంది. ఈ ప్రమాదంలో దుకాణంలో నిద్రిస్తున్న రమేష్‌యాదవ్‌(29) సజీవ దహనమయ్యాడు.