హైదరాబాద్ : ఉత్తరాఖండ్‌లో రేపు వాతావరణంలో మార్పులు ఉంటాయని భారత వాతావరణ శాఖ నివేదిక ఇచ్చినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ బిక్రమ్‌సింగ్ తెలిపారు. గ్రాడ్యుయేషన్ పరేడ్‌లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతికూల వాతావరణం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు. ఉత్తరాఖండ్ వరదలకు 6,200 మంది ఆర్మీ ట్రూప్స్‌ను పంపినట్లు చెప్పారు. ఉత్తరాఖండ్ యాత్రికులను ప్రాణాలతో రాక్షించటమే ప్రధాన ధ్వేయంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. అమరనాథ్ యాత్రకు ఎప్పటిలాగానే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.




