అమీనాబాద్ లో ఇందిరమ్మ నూతన గృహం ప్రారంభం
కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్…
చెన్నారావుపేట, మార్చి 7( జనం సాక్షి): ఇందిరమ్మ పథకంలో నూతనంగా నిర్మించుకున్న గృహాన్ని కాంగ్రెస్ మండల అధ్యక్షులు సిద్ధన రమేష్ ప్రారంభించారు. మండలంలోని అమీనాబాద్ గ్రామానికి చెందిన బేతి అశోక్- ప్రవళిక దంపతులు ఇందిరమ్మ పథకంలో నూతన గృహాన్ని నిర్మించుకున్నారు. శుక్రవారం గృహప్రవేశం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగా ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో అమీనాబాద్ గ్రామ సర్పంచ్ దార రంజిత్, చెన్నారావుపేట మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉప సర్పంచ్ బండి హరీష్, నర్సంపేట వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ చీర అశోక్, వార్డు సభ్యులు దయ్యాల రాజు, ఊరుగొండ సునీత వెంకన్న, మాజీ సర్పంచులు బండి బాలరాజు, సిద్దన మల్లేష్, నర్సంపేట ఆత్మ డైరెక్టర్ కడుదూరి రాజు, తదితరులు పాల్గొన్నారు.



