Monday, 2 November 2026

కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌లపై కుట్రల్ని ఖండించిన టీయూజేఎస్‌

హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్‌ అయిన తెలంగాణ ఉద్యమ రథసారథి ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమీర్‌ అలీ ఖాన్‌ల నియామకాలపై కుట్రలు చేయడాన్ని తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్‌) తీవ్రంగా ఖండించింది. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే గళాలను అడ్డుకోవడం సమంజసం కాదని, వారి నియామకాన్ని అడ్డుకోవడం అంటే తెలంగాణ ప్రజలను అవమానపరచడమేనని పేర్కొంది. గవర్నర్‌ ఆమోదించాక కూడా ఎమ్మెల్సీల నియామకాలపై అభ్యంతరాలు తెలపడం సరికాదని ఈ మేరకు ఉద్యమ జర్నలిస్టులు ఎంఎం రహమాన్‌, ఎండి మునీర్,  కె రమేష్‌బాబు, టి రమేష్‌, సుమబాల, యాటకర్ల మల్లేశం, పసునూరి రవీందర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.