కేటీఆర్ కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

జీవన్ రెడ్డి నామినేషన్ కు వెళ్లే వాహనంపై నుండి జారిపడిన వైనం

ఆర్మూర్ : బిఆర్ఎస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్ రెడ్డి నామినేషన్ కు ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలూరు బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన రోడ్డు షోలో ప్రసంగించారు. అనంతరం నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. మార్గమధ్యలోనే వాహనంపైనుండి రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డి, కేటీ రామారావు, జీవన్ రెడ్డిలు వాహనంపై నుండి జారిపడ్డారు. రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేష్ రెడ్డికి స్వల్ప గాయాలు అయినట్లు సమాచారం. వారిని ఆసుపత్రికి తరలించారు.