భూదాన్ పోచంపల్లి నూతన ఎస్‌ఐగా జగన్ బాధ్యతల స్వీకరణ

భూదాన్ పోచంపల్లి, జూలై 30 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా జె.జగన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.



