మేదరి మహేంద్ర కులానికి డిఎన్టిగా గుర్తింపు

తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 10 ద్వారా మేదరి మహేంద్ర కులాన్ని డి నోటిఫైడ్, నోమాడిక్, సెమీ నోమాడిక్ (డిఎన్టీ ) కమ్యూనిటీలా జాబితాలో అధికారికంగా చేర్చినందుకు తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేస్తున్నాముతెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం సహాయ ప్రచార కార్యదర్శి పిల్లి నరేష్ మాట్లాడుతూ ఈ నిర్ణయం మేదరి మహేంద్ర సమాజాభివృద్ధికి చారిత్రాత్మక మైలురాయిగా నిలుస్తుందని ఈ గుర్తింపుతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీడ్ పథకం సహా డి నోటిఫైడ్ నోమాడిక్ సేమినోమాడిక్ కమ్యూనిటీల కోసం అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందే అవకాశం కలుగుతుందని, అలాగే విద్యా ఉపాధి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో రాజకీయంగా ప్రత్యేక అవకాశాలు లభించడంతోపాటు సామాజిక ఆర్థిక సాధికారతకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ విజయానికి తెలంగాణ మేదరి మహేంద్ర సంఘం చేపట్టిన నిరంతర పోరాటం ప్రభుత్వానికి చేసిన విజ్ఞప్తులు సమాజ ప్రతినిధులు కృషి కారణమని తెలియజేశారు మరియు ఈ యొక్క కృషికి మేదరి కుల అభివృద్ధికి నిరంతరం ఆలోచిస్తూ తెలంగాణ రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం పక్షాన పోరాడిన మా రాష్ట్ర అధ్యక్షులు జర్రిగల శ్రీనివాస్ గారికి మరియు బీసీ ఏ గ్రూపు నుండి 49 కులాలు E గ్రూపు నుండి రెండు కులాలను గుర్తించి డి ఎన్ టి లో చేర్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎన్నో సంవత్సరాల తరువాత మా పోరాట ఫలితాన్ని గుర్తించి మమ్ములను గుర్తించిన ఈ ప్రభుత్వానికి ఎంతో రుణపడి ఉన్నాము అని కొనియాడారు.