రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు
ఉర్కొండ మే 26, ( జనం సాక్షి ) ; ఊర్కోండ మండల పరిధిలో జిన్నింగ్ మిల్ సమీపంలో జడ్చర్ల – కోదాడ రహదారిపై ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తలకొండపల్లి మండలం కర్కస్ తండాకు చెందిన అంజి అనే వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అంజి తలకు తీవ్ర గాయాలవడంతో, స్థానికులు వెంటనే 108 ద్వారా అతడిని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది



