కర్షకుడి కంట కన్నీరు

మెదక్ జులై 15 (జనం సాక్షి) వాన మబ్బులు వెలవెలా , రైతన్న విలవిల అడుగంటుతున్న భూగర్భ జలాలు సాగుకు కరువైపున నీరు వాన పడక కర్షకుడికి పాట్లు తప్పవా..? సాగుకు సన్నద్ధమైన కర్షకుడు. వాన లేక విలవిల పోతున్న రైతు . అన్నమో రామచంద్రా అని మొరపెట్టుకున్న…. కనుకరించని వరుణుడు.. సాగుకు తప్పవా తిప్పలు అన్నట్టు రైతు విలవిల పోతున్నారు . నారు పోసి నాటుకు వచ్చిన సగం కాలం గడిచే సమయానికి కూడా వాన రాక సాగకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి . నిండు వానకాలానికి కూడా ఎండలు భగవంతున్నాయి . భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి . వరి నాట్లు వేసిన పంట పొలాలు నీరందక ఎండిపోతున్నాయి . సాగుకు బోర్ల కాడ తప్ప.. కాల్వ కింద సాగుకు రైతన్న ఎదురుచూపు . మేఘాలు కమ్మకోవు .. వానలు రావు అన్న సందేహంలో కర్షకుడు .? హవేలీ ఘనపూర్ మండలంలోని పోచారం ప్రాజెక్టు ఆధారంగా పంట పొలాలను సాగు చేసే రైతులకు నీరు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు . ప్రాజెక్టులు మైదానం తప్ప నీరు ఎక్కడ కనిపించకుండా పోయింది. వరుడు ఎప్పుడు వరిస్తాడు… ప్రాజెక్టును ఎప్పుడు నింపుతాడు అన్నట్టు ఎదురుచూస్తున్నారు రైతులు . ప్రాజెక్టు కింద 19540 ఎకరాలకు పైగా ఎకరాల భూములు ఆయకట్టు కింద వరి సాగుకు ప్రాజెక్టు ప్రాణాదారం . ఈ ప్రాణాధారంమే డెడ్ స్టోరేజ్ కి చేరడంతో రైతుకు సాగు కష్టమని చెప్పొచ్చా… ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.103 టీఎంసీల నీరు మాత్రమే మిగిలి ఉంది . ప్రస్తుతం అలముకున్న ఎండలు , గాలి ద్వారా నీరు ఇంకా అడుగంటే ప్రమాదంలో ఉంది . ప్రాజెక్టు కింద సాగు కోసం రైతన్న , నారు కోసం నాటు కోసం ఎదురు కాపులు కాస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రైతులు వర్షం కోసం ఆకాల్సిందేల ఉంది. వర్షం ఎప్పుడు వచ్చినో పంట ఎప్పుడు వేసేనో అన్నట్లుగా ఉంది . మెదక్ మండలంలో 17750 ఎకరాల వరి సాగుకు ఉన్నాయి రాయని చెరువు ప్రాజెక్టు మరియు కొంటూరు లలో నీరు లేక రైతులు విలవిల వాడిపోతున్నారు బోర్ల వద్ద నీరు గ్యాప్ ఇచ్చుకుంటా పోయడం మరియు ఈ గాలికి పారిన పొలం ఇంకిపోవడంతో రైతులకు ఏం చేయాల తోచని స్థితిలో ఉన్నారు దీనివలన చెరువు పలు గ్రామాలలో బోరు బావుల వద్ద గత కొన్ని రోజుల కింద కురిసిన వర్షానికి నాటు వేయగా…. ఇప్పుడు ఎండ తీవ్రతకు నీరు అందక ఎండిపోతున్నాయి . తొందరపడి ఆగమయ్యానా అన్న ఆలోచనలు మిగిలిపోయిన కర్షకుడు . భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి . పలు గ్రామాల్లో నీరందక వాటర్ ట్యాంకర్ల ద్వారా ప్రజలకు గ్రామ పంచాయితీ అధికారులు నీటిని అందిస్తున్నారు .