ఆజాద్ వ్యాఖ్యలను తప్పుబడ్డిన కేశవరావు
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్‌నేత కేశవరావు కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఇలాంటి వ్యాక్యల కారణంగా ప్రజలు కాంగ్రెస్‌కు దూరమవుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణకు అన్ని పార్టీలు ఒప్పుకొన్నాయని, తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది కాంగ్రెస్సేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ అంశాన్ని త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు.



