ఏటా 2వేల కొత్త బస్సులు: ఏకే ఖాన్‌

మియాపూర్‌: మియాపూర్‌ బస్సు బాడీ యూనిట్‌లో నూతన పరిజ్ఞానంతో రూపొందించిన సూపర్‌ లక్జరీ బస్సును ఆర్టీసీ ఎండీ ఎ.కె.ఖాన్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా రెండు వేల కొత్త బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. అదేవిధంగా గత ఏడాదితో పోల్చుకుంటే నష్టాలు తగ్గుముఖం పట్టాయన్నారు. కార్మికుల సంక్షేమానికి సంస్థ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.