Tuesday, 3 November 2026

అనుమానాస్పద స్థితిలో మహిళ ఆత్మహత్య

అడ్డగుట్ట: అనుమానాస్పద స్థితిలో ఓ మహిళ ఆత్మహత్మ చేసుకున్న ఘటన తుకారాం గేటు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆదివారం రాత్రి జరిగింది. ఏసీపీ మురళీధర్‌ తెలిపిన వివరాల ప్రకారం ఈస్ట్‌ మారేడ్‌పల్లి ఘరోందా అపార్ట్‌మెంటులో మూడో అంతస్తు ఫ్లాట్‌ నెంబరు 301లో వాసురెడ్డి నరేష్‌ (29), దుర్గ (18) దంపతులు నివాసముంటున్నారు. నరేష్‌కి గత సంవత్సరం ఆగస్టులో దుర్గతో రెండో వివాహం జరిగింది ఆదివారం నరేష్‌ బయటకి వెళ్లి చూసేసరికి దుర్గ ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుందని నరేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దుర్గ తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెది హత్యేనని ఆరోపిస్తున్నారు. ఇది హత్య లేక ఆత్మహత్య అనే కోణం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *