కోఠిలో అగ్నిప్రమాదం, దుకాణాలు దగ్ధం
హైదరాబాద్ : కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజి సమీపంలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 10 దుకాణాలు అగ్ని కి ఆహుతి అయ్యాయి. ఉస్మానియా మెడికల్ కళాశాలను ఆనుకొని ఉన్న ఫుట్ పాత్ షాపుపై విద్యుత్ వైర్లు తెగిపడటంతో మంటలంటుకున్నాయి.
దీంతో పక్కనున్న షాపులకు మంటలు వ్యాపించాయ. అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే దుకాణాలన్ని పూర్తిగా దగ్ధం అయ్యాయి.


