క్షీణిస్తున్న కిషన్‌రెడ్డి ఆరోగ్యం
హైదరాబాద్ : విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ భాజపా నేతలు నిమ్స్‌లో దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే దీక్షలో ఉన్న ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అరోగ్య పరిస్థితిపై వైద్యులు అందోళన వ్యక్తం చేశారు. ఐదు రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపట్టడంతో ఆయన శరీరంలో రక్తపోటు, చక్కెర, పొటాషియం స్థాయి పడిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.


