గడపగడపకు తెలంగాణ
హైదరాబాద్ : నగరంలో ‘గడపగడపకు తెలంగాణ’ కార్యక్రమాన్ని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గర్వష్టని, బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అడ్డగోలుగా 20 వేల కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపారన్నారు. విద్యుత్‌పై కాంగ్రెస్, టీడీపీలని దొంగనాటకాలన్నారు. పవర్ కోసమే టీడీపీ దీక్షలు చేపట్టిందని విమర్శించారు.
రాష్ట్రంలొ గత 37 ఏళ్లలో కాంగ్రెస్ 20 ఏళ్లు, టీడీపీ 17 పరిపాలించాయని, ఈనాటి విద్యుత్ సంక్షోభానికి ఆ రెండు పార్టీలే కారణమన్నారు. పరిశ్రమలు ఎక్కడకీ తరలిపోవద్దని కోరారు. విద్యుత్ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. హైదరాబాద్‌లో 70 లక్షల మంది తెలంగణావాదులుంటే 5 లక్షల మంది సీమాంద్రులున్నారని తెలిపారు. జంటనగరాల్లో తెలంగాణవాదం బలంగా ఉందని చెప్పారు. హరీష్‌రావు ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయం సాధిస్తామనేది టీఆర్‌ఎస్ సెంటిమెంట్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 100 అసెంబ్లీ, 15 ఎంపీ సీట్లే అక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.


