గ్రాండ్ మాస్టర్ అర్జున్‌కు..
గ్రాండ్ వెల్‌కమ్
– శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
హైదరాబాద్, ఆగస్టు16(జనం సాక్షి ) : గ్రాండ్ మాస్టర్ అయిన చెస్ క్రీడాకారుడు ఇరిగేసి అర్జున్‌కు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన కుటుంబసభ్యులతో పాటు తెలంగాణ చదరంగ అసోషియేషన్ కార్యదర్శి ప్రసాద్, కోచ్ సంపత్, వరంగల్ చెస్ అసోషియేషన్ కార్యదర్శి టావిూలు అర్జున్‌కు ఘనస్వాగతం పలికారు. హన్మకొండకు చెందిన అర్జున్… అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్, మాస్టర్ టోర్నీలో సత్తాచాటి మూడో గ్రాండ్ మాస్టర్ నార్మ్ సొంత చేసుకున్నాడు. అర్జున్ తన 14ఏళ్లకే గ్రాండ్ మాస్టర్ ¬దా సాధించడం విశేషం. తెలుగు రాష్ట్రాల నుంచి ఆ ఘనత సాధించిన ఐదో క్రీడాకారుడిగా తెలంగాణ నుంచి తొలి వ్యక్తిగా నిలిచాడు. దేశం మొత్తం విూద అర్జున్ 54వ గ్రాండ్ మాస్టర్‌గా నిలిచాడు.



