జగన్‌ అక్రమాస్తుల కేసు

ఛార్జిషీటునుంచి తనను తొలగించాలని విజయసాయి పిటిషన్‌
హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తులు, ఎమ్మార్‌, ఓఎంసీ కేసుల్లో నిందితుల రిమాండ్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. జగన్‌, మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరెడ్డి, సనీల్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డిల రిమాండ్‌ ఏప్రిల్‌ 1 వరకు పొడిగించింది. ఎమ్మార్‌, వాన్‌పిక్‌ ఛార్జిషీట్లలో అభియోగాల నమోదుపై సీబీఐ వాదనలు పూర్తయ్యాయి. జగన్‌ అక్రమాస్తుల కేసులో రెండో ఛార్జిషీటు నుంచి తనను తొలగించాలని విజయసాయిరెడ్డి పిటిషన్‌ దాఖలుచేశారు. విజయసాయిరెడ్డి పిటిషన్‌పై విచారణను సీబీఐ న్యాయస్థానం ఏప్రిల్‌ 1కి వాయిదా వేసింది.