డబ్బు తరగిపోతుంది.. స్థిరాస్తి శాశ్వతంగా ఉంటుంది: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వినోబాబావే, రామచంద్రారెడ్డి స్ఫూర్తితోనే భూదానాలు జరిగాయని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 1971లో భూసంస్కరణలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. భూదాన్‌ భూముల నిర్వాసితులకు రూ.11.20 కోట్ల చెక్కులను సీఎం పంపిణీ చేశారు. ఇచ్చిన భూముల్లో పేదప్రజలు సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. జీవితంలో డబ్బు తరగిపోతుంది కానీ స్థిరాస్తి శాశ్వతంగా ఉంటుందని ముఖ్యమంత్రి పేర్కోన్నారు.