నర్సంపేట అభివృద్ధి ప్రదాత రేవూరి..
రేవూరి జన్మదిన వేడుకల్లో
డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి…
ఫోటో రైటప్: వేడుకల్లో పాల్గొన్న రాణా ప్రతాప్..
వరంగల్ బ్యూరో: సెప్టెంబర్ 1 (జనం సాక్షి )
నర్సంపేట నియోజకవర్గం లో నిజాయితీతో అభివృద్ధి చేసిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అభివృద్ధికి మార్గదర్శకుడిగా నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అని నర్సంపేట నియోజకవర్గ బిజెపి నాయకులు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు.
గురువారం గిర్ని బావి కేంద్రం లో రేవూరి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ నీతి, నిజాయితి, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనంగా పనిచేశారని రేవూరి సేవలను కొనియాడారు.
నిత్యం ప్రజా సమస్యలపై పోరాడి ప్రజల మధ్య ఉంటారని ఆయన తెలిపారు.
యువతకు మార్గదర్శకులుగా ఉంటూ యువజన సంక్షేమమే లక్ష్యంగా కృషి చేస్తారని అన్నారు.
రేవూరి చూపిన మార్గం అందరికీ ఆదర్శమని రేవూరి సేవలను గుర్తు చేశారు.
విలువలతో కూడిన రాజకీయాలు చేసే అసలు సిసలైన నాయకులుగా చలామణి అవుతున్న రనీ ఆయన అన్నారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న శుభసందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు,మాజీ శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా
కేకు కట్ చేసి మిఠాయిలు ,పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పెంచాల సతీష్ కుమార్, బిజెపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముకిడే ప్రభాకర్ పి ఎస్ ఎస్ వైస్ చైర్మన్ పాలడుగుల జీవన్ జిల్లా అధికార ప్రతినిధి మాచర్ల దేవేందర్ మాజీ ఎంపిటిసి బొల్లెపెల్లి రాము నేదురు రాజేందర్ ఉపసర్పంచ్ గోగుల ప్రకాష్ రెడ్డి ముద్రభోయిన రామ్ రాజ్ అనగోని క్రాంతి నల్ల రవి అన్న లింగన్న వడ్డపల్లి క్రాంతి శివాజీ రెడ్డి అశోక్ బుడిగె చిరంజీవి ఏడుకొండ కర్ణాకర్ రేవూరి విజేందర్రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.