సుందరయ్య శతజయంతి కార్యక్రమం: మీడియా సంస్కృతిపై చర్చ

హైదరాబాద్‌: ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి సంవత్సరం సందర్భంగా ఈరోజు నగరంలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ఒక సమావేశం జరిగింది. ‘ మీడియా కల్చర్‌ ఆండ్‌ ద పీపుల్‌ ‘ అనే అంశంపై జరిగిన  సదస్సులో హిందూ పత్రిక ముఖ్య సంపాదకులు ఎన్‌, రామ్‌ ప్రసంగించారు. సీపీఎం  రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, సీనియర్‌ పాత్రికేయులు తెలకపల్లి రవి, ఈనాడు జర్నలిజం స్కూలు ప్రిన్సిపాల్‌ ఎం. నాగేశ్వరరావు తదితరులు పాలొన్నారు.