హైదరాబాద్‌ పర్యటించిన: రాహుల్‌ ద్రవిడ్‌

హైదరాబాద్‌: మాజీ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాన్‌సూన్‌ రెగెట్టా పోటీల వీక్షణ కోసం హైదరాబాద్‌ వచ్చారు. ఈరోజు ఆయన ప్రముఖ యువ నటుడు రానాతో కలిసి హుసేన్‌ సాగర్‌ తీరంలో కలియ తిరిగారు. ఇక్కడకు రావడం తనకు ఆనందంగా ఉందని ద్రవిడ్‌ వెల్లడించారు. అనంతరం ఆయన యువ సెయిలర్లతో కలిసి సాగర్‌ విహరించారు. క్రికెట్‌ కన్నా సెయిలింగ్‌ చాలా కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.